హిట్‌మ్యాన్ కాదు.. ఇకపై డాక్టర్ రోహిత్.. పూర్తి వివరాలు ఇవిగో

Published : Jan 25, 2026, 02:18 PM IST

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు నవీ ముంబైలోని అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైదానంలో అద్భుతమైన ప్రదర్శన, నాయకత్వ పటిమతో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలపడంతో.. 

PREV
15
రోహిత్ శర్మ కీర్తి కిరీటంలో..

భారత క్రికెట్ చరిత్రలో హిట్ మ్యాన్‌గా తనదైన ముద్ర వేసిన రోహిత్ శర్మ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నవీ ముంబైలోని అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా, అసాధారణ నాయకత్వ పటిమతో భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపినందుకు గుర్తింపుగా ఈ సత్కారం లభించింది.

25
టీ20 ప్రపంచ కప్‌లో..

ముఖ్యంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించి దశాబ్దకాలపు నిరీక్షణకు తెరదించినందుకు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచినందుకు ఈ విశ్వవిద్యాలయం రోహిత్ కృషిని కొనియాడింది.

35
డాక్టర్ అజింక్య పాటిల్ చేతుల మీదుగా

యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అజింక్య పాటిల్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్న రోహిత్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన నిలిచారు.

45
అంకితభావానికి దక్కిన ప్రతిఫలం

ఈ గౌరవ డాక్టరేట్ రోహిత్ సాధించిన అంకెలకు మాత్రమే కాకుండా, క్రికెట్ క్రీడ పట్ల ఆయనకున్న అంకితభావానికి దక్కిన ప్రతిఫలంగా భావించవచ్చు.

55
రోహిత్ భావోద్వేగం

డాక్టరేట్ అందుకున్న అనంతరం రోహిత్ భావోద్వేగంతో మాట్లాడుతూ, ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని, దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories