Pro Kabaddi League 2023: తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ లో అసాధారణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. పీకేఎల్ 10వ సీజన్ ప్రారంభ మొదటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. కేవలం ఆరు పాయింట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు.
హైదరాబాద్ లోని బాలయోగి శాట్స్ ఇండోర్ స్టేడియం, విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం హోమ్ మ్యాచ్ లలో టైటాన్స్ తమ సత్తా చాటే యుద్ధభూమిగా నిలుస్తున్నాయి. ఈ వేదికలు జట్టు విజయ కాంక్షకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వీరా స్పోర్ట్స్ గర్వించదగిన ఫ్రాంచైజీ, వాయా గ్రూప్ నుండి శ్రీ శ్రీనివాస్ శ్రీరామనేని, గ్రీన్కో గ్రూప్ నుండి మహేష్ కొల్లి అలాగే, గౌతమ్ నేదురుమల్లి నేతృత్వంలోని తెలుగు టైటాన్స్ అలుపెరగని సంకల్ప స్ఫూర్తికి ప్రతీకగా ముందుకు సాగుతోంది.
ప్రొ కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ సీజన్ 2, సీజన్ 4లో ప్లేఆఫ్ బెర్త్ లను కైవసం చేసుకుంది. సీజన్-2లో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో టైటాన్స్ 38-39 తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం పాలైంది. సీజన్ 9 కోసం వ్యూహాత్మక మార్గాన్ని ఎంచుకున్న తెలుగు టైటాన్స్ పికెఎల్ లో బలమైన డిఫెండర్ మంజీత్ చిల్లర్ సేవలను పొందింది, అతన్ని సహాయ కోచ్ గా నియమించింది. ప్రొఫెషనల్ కబడ్డీ రంగంలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న జట్టు నిబద్ధతకు ఈ చర్య బలం చేకూరుస్తోంది.
పటిష్టమైన లైనప్ తో పీకేఎల్ సీజన్ 10లోకి అడుగుపెట్టిన తెలుగు టైటాన్స్ జట్టు కోచ్ శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో, ప్రముఖ భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కబడ్డీ మైదానంలో తన అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా సెహ్రావత్ ఇటీవల లీగ్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులను బద్దలు కొట్టాడు.
తెలగు టైటాన్స్ జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి..
రైడర్స్: రజనీష్, వినయ్, పవన్ కుమార్ సెహ్రావత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్, జవారే, రాబిన్ చౌదరి, మోహిత్, మిలాద్ జబ్బారి
డిఫెండర్లు: పర్వేష్, భైన్‌వాల్, మోహిత్, నితిన్, అంకిత్, గౌరవ్ దహియా, అజిత్ పాండురంగ్ పవార్
ఆల్ రౌండర్లు: శంకర్ భీమ్‌రాజ్ గడై, సంజీవి ఎస్, ఓంకార్ ఆర్. మోర్, హమీద్ మీర్జాయీ నాదర్