T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై చర్చ కొనసాగుతోంది. రింకూ సింగ్ కోసం శుభమాన్ గిల్, జితేష్ శర్మలను తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, రింకూ కాబోయే సతీమణి ప్రమేయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెలెక్టర్లు ప్రకటించిన జట్టుపై విస్తృతంగా వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, రింకూ సింగ్ ఎంపిక వెనుక శుభమాన్ గిల్, జితేష్ శర్మలపై వేటు పడిందనే బలమైన వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న చర్చ కూడా సాగుతోంది.
25
రింకూ కోసం ఆ ఇద్దరు..
రింకూ సింగ్ అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతను ఇప్పటికే ఫినిషర్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రింకూ సింగ్ జట్టులో లేకపోవడం, ఆ తర్వాత సడెన్‌గా ప్రపంచకప్ జట్టులోకి రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రింకూ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉంటే, సౌత్ ఆఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనేది అభిమానుల ప్రధాన సందేహం.
35
గిల్‌ను తప్పించారు..
గిల్ కొంతకాలంగా ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని తప్పించడం సరైన నిర్ణయమే. కానీ, జితేష్ శర్మ చేసిన తప్పేంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్‌కు అవకాశం కల్పించడానికే జితేష్ శర్మను అన్యాయంగా తొలగించారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‌ను కూడా రింకూ కోసమే పక్కన పెట్టారని అంటున్నారు. సెలెక్టర్లు జట్టు కాంబినేషన్ కోసమే ఈ మార్పులు చేశామని చెబుతున్నప్పటికీ, అభిమానులు మాత్రం వారి వివరణ కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించినప్పటికీ, చాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యశస్వి జైస్వాల్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే వాదన కూడా ఉంది. దీనితో పాటు, రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక అతని కాబోయే సతీమణి ప్రమేయం కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్ కాబోయే సతీమణి పేరు ప్రియా సరోజ్. ఈమె సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్ల మీద ప్రియా సరోజ్ ఒత్తిడి పెంచారనే చర్చ జరుగుతోంది.
55
అతడి కోసం బ్యాకప్ వికెట్ కీపర్..
అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఫినిషర్‌గా రింకూ కోసం జితేష్‌ను పక్కన పెట్టారని, అదే సమయంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్‌ను తీసుకోవాల్సి వచ్చిందని, దీంతో శుభమాన్ గిల్ పైన వేటు తప్పలేదని అంటున్నారు. అయితే, ఈ సోషల్ మీడియా చర్చలు ఎలా ఉన్నా, రింకు సింగ్ ఒక గొప్ప ఆటగాడు అని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం అతను విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల రేసులోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 35 మ్యాచ్‌ల్లో 550 పరుగులు సాధించాడు. అతని యావరేజ్ 42.30 కాగా, స్ట్రైక్ రేట్ 161.76.