Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే

Published : Sep 29, 2026, 01:43 PM IST

Most International Centuries: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించడం ఒక ఎత్తైతే, ఏళ్లకు ఏళ్లు అదే స్థిరత్వంతో వందల కొద్దీ మ్యాచ్‌లలో పరుగులు సాధించి అత్యధిక సెంచరీలు సాధించడం మరెంతో అరుదైన విషయం. టెండూల్కర్ అత్యధిక సెంచరీలతో టాప్ లో ఉన్నారు.

PREV
16
క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 లెజెండ్స్

క్రికెట్‌లో సెంచరీ చేయడం అనేది ప్రతీ బ్యాటర్‌కు ఒక కల. అంతర్జాతీయ స్థాయిలో 100 పరుగులు సాధించడం బ్యాటర్ ప్రతిభకు, ఫోకస్‌కు, పట్టుదలకు పెద్ద నిదర్శనం. మైదానంలో వంద పరుగులు దాటడం ఆటగాడి కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. క్రికెట్ చరిత్రలోనే అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు.

మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) కన్సిస్టెంట్‌గా ఆడుతూ సెంచరీలు బాదే బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారు. మ్యాచులను గెలిపించిన ఇన్నింగ్స్‌ల నుంచి కష్టసమయాల్లో జట్టును ఆదుకున్న ఇన్నింగ్స్‌ల వరకు ఈ సెంచరీలు వారి ప్రతిభను చూపిస్తాయి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 14,085 పరుగులు పూర్తి చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ మార్కును దాటిన మూడో వ్యక్తిగా సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఇక వెస్టిండీస్ తో తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది 15 వేల పరుగులు సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాటర్ల వివరాలు గమనిస్తే..

26
1. సచిన్ టెండూల్కర్ (భారత్): 100 సెంచరీల ఆల్‌టైమ్ కింగ్

క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ 1989 నుండి 2013 వరకు తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించారు. కెరీర్‌లో మొత్తం 664 మ్యాచ్‌లు ఆడి 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు సాధించారు. సచిన్ సగటు 48.52 కాగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 248 నాటౌట్. సచిన్ ఖాతాలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో 74 సార్లు నాటౌట్‌గా నిలవగా, 34 సార్లు డకౌట్ అయ్యారు.

36
2. విరాట్ కోహ్లీ (భారత్): రన్ మెషీన్

ప్రస్తుత కాలంలో రికార్డుల వేట కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ 2008 నుండి 2026 వరకు 563 మ్యాచ్‌లు ఆడారు. 630 ఇన్నింగ్స్‌ల్లో 52.97 సగటుతో 28,498 పరుగులు చేశారు. ఇందులో కోహ్లీ అత్యధిక స్కోరు 254 నాటౌట్. విరాట్ ఇప్పటివరకు 86 సెంచరీలు, 148 అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. కోహ్లీ 92 సార్లు నాటౌట్‌గా నిలవగా, 40 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యారు.

46
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): ఆసీస్ దిగ్గజం

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 1995 నుండి 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 560 మ్యాచ్‌లు ఆడి 668 ఇన్నింగ్స్‌ల్లో 27,483 పరుగులు సాధించారు. ఆయన సగటు 45.95 కాగా, అత్యధిక స్కోరు 257. పాంటింగ్ మొత్తం 71 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు బాదారు. ఇందులో 70 సార్లు నాటౌట్‌గా నిలవగా, 39 సార్లు డకౌట్‌గా వెనుతిరిగారు.

56
4. కుమార సంగక్కర (శ్రీలంక): లంక లెజెండ్ అద్భుత రికార్డులు

శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర 2000 నుండి 2015 వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. మొత్తం 594 మ్యాచ్‌ల్లో 666 ఇన్నింగ్స్ ఆడి 28,016 పరుగులు చేశారు. ఆయన బ్యాటింగ్ సగటు 46.77 కాగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 పరుగులు. సంగక్కర తన కెరీర్‌లో 63 సెంచరీలు, 153 హాఫ్ సెంచరీలు చేశారు. సంగక్కర 67 సార్లు నాటౌట్‌గా నిలవగా, 28 సార్లు డకౌట్ అయ్యారు.

66
5. మహేళ జయవర్ధనే (శ్రీలంక): క్లాసిక్ బ్యాటింగ్‌తో సుదీర్ఘ ప్రయాణం

శ్రీలంక క్లాసిక్ బ్యాటర్ మహేళ జయవర్ధనే 1997 నుండి 2015 మధ్య 652 మ్యాచ్‌లు ఆడారు. 725 ఇన్నింగ్స్‌ల్లో 39.15 సగటుతో 25,957 పరుగులు బాదారు. మహేళ అత్యధిక వ్యక్తిగత స్కోరు 374 పరుగులు. తన కెరీర్‌లో 54 సెంచరీలు, 136 హాఫ్ సెంచరీలు సాధించిన ఆయన 62 సార్లు నాటౌట్‌గా నిలిచారు. జయవర్ధనే 47 సార్లు డకౌట్‌ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories