Team India: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోదని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ సూపర్ 8 రౌండ్‌లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు.
పాకిస్తాన్ జట్టు ప్లేయర్ మహ్మద్ అమీర్ అంచనా ప్రకారం టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు భారత్ అర్హత సాధించదట. ఫిబ్రవరి 21 నుంచి సూపర్ 8 రౌండ్ ప్రారంభమైంది. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. సెమీస్‌కు చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాలి,.
25
సెమీఫైనల్ చేరుకోదు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోదని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ సూపర్ 8 రౌండ్‌లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 రౌండ్ ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి సెమీఫైనల్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి.
35
గ్రూప్ ఆఫ్ డెత్
భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలతో కూడిన గ్రూప్ 1ను "గ్రూప్ ఆఫ్ డెత్"గా పరిగణిస్తున్నారు. గ్రూప్ స్టేజిలో ఈ నాలుగు జట్లు అపజయం ఎరుగనివిగా నిలిచాయి. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడుతుంది. సెమీఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే భారత్ మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో గెలవాలి. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య దేశం అయినప్పటికీ, అమీర్ తన అంచనాకు బ్యాటింగ్ లైనప్ వైఫల్యం, ప్రత్యర్థుల బలాన్ని కారణాలుగా పేర్కొన్నాడు.
సూపర్ 8 రౌండ్‌లోని గ్రూప్ 1లోని నాలుగు జట్లు మునుపటి రౌండ్‌లో అపజయం ఎరుగనివి. అంటే అవి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలిచి వచ్చాయి. జింబాబ్వే మూడు మ్యాచ్‌లలో గెలిచి, ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అజేయంగా నిలిచింది. ఇది గ్రూప్ 1ను చాలా కఠినమైనదిగా మార్చింది.
55
ఆ జట్టు ప్రమాదమే..
ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో తలపడనుంది టీమిండియా. అక్కడ సికిందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే ప్రమాదకరంగా మారవచ్చు. చివరి సూపర్ 8 మ్యాచ్ మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతుంది. టీమ్ ఇండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాలి, ఇది సులభం కాదని అమీర్ అంచనా.