Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై విమర్శలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద సరైన టెక్నిక్ లేదని అమీర్ వ్యాఖ్యానించాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. పాక్ జట్టును 114 పరుగులకే చిత్తు చేసి.. 61 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 8కి క్వాలిఫై అయింది. ఇందులో ఓపెనర్ ఇషాన్ కిషన్ అజేయంగా 77 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
25
అభిషేక్ శర్మ డకౌట్
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయిన విషయం విదితమే. నాలుగు బంతుల్లో జీరో పరుగులతో పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పాకిస్తాన్ జట్టు మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
35
అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై విమర్శలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద సరైన టెక్నిక్ లేదని అమీర్ వ్యాఖ్యానించాడు. స్థిరత్వం లేని బ్యాటింగ్ వల్ల అతను జట్టుకు భారంగా మారే అవకాశం ఉందని తెలిపాడు.
అమీర్ ఇలా గతంలో తన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడో.. లేదో.. పాక్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ వేసి మరీ అభిషేక్ శర్మ వీక్ నెస్ పై దెబ్బ కొట్టారని చెప్పొచ్చు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కుని డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఇది నిజంగా అభిమానులను నిరాశపరిచింది.
55
అభిషేక్ శర్మ కొడితే హాఫ్ సెంచరీ లేదంటే..
ఇదొకటే కాదు గతంలోనూ న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ విషయాన్ని కూడా తీసుకుంటే అభిషేక్ శర్మ కొడితే హాఫ్ సెంచరీ లేదంటే.. డకౌట్ అవుతూ నిరాశ పరుస్తున్నాడు. గతంలో భారత మాజీ ప్లేయర్స్ సైతం అభిషేక్ శర్మ టెక్నిక్ గురించి ప్రస్తావించారు. ఐసీసీ లాంటి టోర్నీలలో ప్రత్యర్ధి బౌలర్లకు ఈజీగా తెలుస్తుందని.. మార్చుకోవాలని సూచించారు.