ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మైఖేల్ షూమాకర్ హెల్మెట్‌ సైన్

Published : Apr 16, 2025, 08:56 AM IST

Michael Schumacher: మైఖేల్ షూమాకర్ జర్మనీకి చెందిన, ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ (F1) రేసింగ్ స్పోర్ట్స్ పర్సన్.  దశాబ్దం పాటు కోమాలో ఉన్న మైఖేల్ షూమాకర్, సర్ జాకీ స్టీవర్ట్ కోసం హెల్మెట్‌పై సంతకం చేశారు. ఈ అరుదైన ఘటన ఆయన భార్య కొరిన్నా సహాయంతో జరిగింది.  

PREV
16
ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మైఖేల్ షూమాకర్ హెల్మెట్‌ సైన్

మైఖేల్ షూమాకర్ జర్మనీకి చెందిన, ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ (F1) రేసింగ్ స్పోర్ట్స్ పర్సన్. F1 చరిత్రలో అత్యంత విజయవంతమైన డ్రైవర్లలో ఒకరు. రికార్డు స్థాయిలో ఏడుసార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. 

ప్రపంచంలోని గొప్ప F1 డ్రైవర్లలో ఒకరైన మైఖేల్ షూమాకర్ 11 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత హెల్మెట్‌పై తన ఇనిషియల్స్ M.S తో సంతకం చేశారు. ఈ సంతకం ఆయన భార్య కొరిన్నా సహాయంతో చేశారు.

26
జాకీ స్టీవర్ట్ ధరించిన హెల్మెట్ వేలానికి

ఈ హెల్మెట్ జాకీ స్టీవర్ట్ డిమెన్షియా పరిశోధనా సంస్థ 'రేస్ ఎగైనెస్ట్ డిమెన్షియా' కోసం వేలానికి వెళుతుంది. ఇది జాకీ స్టీవర్ట్ తన రాయల్ స్టీవర్ట్ టార్టన్ డిజైన్‌తో ధరించిన హెల్మెట్.

36
F1 ఛాంపియన్ల సంతకాల హెల్మెట్ వేలం

జాకీ స్టీవర్ట్ వేలానికి పెట్టిన హెల్మెట్‌పై ప్రతి జీవించి ఉన్న F1 ఛాంపియన్ సంతకం ఉంది. వీటిలో షూమాకర్ సంతకం అరుదైనది, ఎందుకంటే ఆయన 11 ఏళ్లు కోమాలో ఉన్నారు. ఈ హెల్మెట్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో ప్రదర్శించబడుతుంది.

 

46
2013 స్కీయింగ్ ప్రమాదం తర్వాత షూమాకర్

డిసెంబర్ 29, 2013 న, ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలలో తన కుమారుడితో కలిసి స్కీయింగ్ చేస్తున్నప్పుడు మైఖేల్ షూమాకర్ తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి, అనేక శస్త్రచికిత్సలు చేశారు. త్వరగా కోలుకోవడం కోసం కోమాలో ఉంచారు. ఆ తర్వాత కోమా నుంచి బయటకు వచ్చారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబం గోప్యంగా ఉంచుతోంది. ప్రస్తుతం అతను స్విట్జర్లాండ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సంరక్షణలో కోలుకుంటున్నారు. 

56
షూమాకర్ సహకారం అమూల్యమైనది: స్టీవర్ట్

85 ఏళ్ల స్టీవర్ట్, షూమాకర్ ఈ మంచి పనికి సంతకం చేయడం అద్భుతమని అన్నారు. ఆయన భార్య సహాయంతో అన్ని జీవించి ఉన్న F1 ఛాంపియన్ల సంతకాలు సేకరించామని చెప్పారు. కాగా, ఆయన సైన్ చేసిన హెల్మెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

66
కొరిన్నా 'ఇన్నర్ సర్కిల్' ఏర్పాటు

షూమాకర్ గోప్యతను కాపాడటానికి కొరిన్నా ఒక 'ఇన్నర్ సర్కిల్'ని ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్‌లో కొద్ది మంది మాత్రమే షూమాకర్‌ను కలుసుకుంటారు.

షూమాకర్ ఇప్పుడు తాతయ్య అయ్యారు. ఆయన కుమార్తె గినా షూమాకర్ మార్చి 29న కుమార్తెకు జన్మనిచ్చింది. గినా గతేడాది తన భర్త ఇయాన్ బెత్కేను వివాహం చేసుకుంది.

జాకీ స్టీవర్ట్ తన భార్య హెలెన్‌కు 2014లో డిమెన్షియా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత 'రేస్ ఎగైనెస్ట్ డిమెన్షియా' సంస్థను ప్రారంభించారు. ఇటీవల ఆయన భార్య తనను గుర్తుపట్టడం లేదని BBCకి చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories