Image credit: Getty
అర్జెంటీనాకి వరల్డ్ కప్ అందించిన లియోనెల్ మెస్సీ, సస్పెన్షన్ ఉండే ఈ రెండు వారాల పాటు టీమ్ నుంచి ఎలాంటి మ్యాచ్ ఫీజు అందుకోడు. రెండు వారాల బ్యాన్ కారణంగా లీగ్1 ఫుట్‌బాల్ లీగ్‌లో ట్రోయిస్, అజకో టీమ్స్‌తో జరిగే మ్యాచుల్లో లియోనెల్ మెస్సీ పాల్గొనడం లేదు...
Image credit: Getty
అయితే మే 21న ఆజీర్ క్లబ్‌తో జరిగే మ్యాచ్‌లో తిరిగి ఆడబోతున్నాడు లియోనెల్ మెస్సీ. ఓ ఫుట్‌బాల్ దిగ్గజంపై ఇలా రెండు వారాల సస్పెన్షన్ వేయడం మెస్సీ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది. అయితే లీగ్1 ఫుట్‌బాల్ లీగ్‌లో 33 మ్యాచుల్లో 75 పాయింట్లు సాధించిన పారిస్ సెయింట్ జెర్మన్, ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది..
Image credit: Getty
2021 సమ్మర్‌లో బార్సిలోనా క్లబ్ నుంచి పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్‌కి మారాడు లియోనెల్ మెస్సీ. 2000వ సంవత్సరం నుంచి బార్సిలోనా క్లబ్లో కెరీర్ కొనసాగించిన లియోనెల్ మెస్సీ, 2021 వరకూ ఆ క్లబ్ తరుపున ఆడి 474 గోల్స్ సాధించాడు..
Lionel Messi
లియెనెల్ మెస్సీకి బార్సీలోనా క్లబ్, ఒక్కో సీజన్‌కి 75 మిలియన్ల యూరోలు (దాదాపు 656 కోట్ల రూపాయలు) చెల్లిస్తూ వచ్చింది... ఆర్థిక కష్టాలు రావడంతో ఇంత భారీ మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేమని బార్సీలోనా స్పష్టం చేయడంతో, మరో గత్యంతరం లేక ఆ క్లబ్ నుంచి బయటికి వచ్చేశాడు మెస్సీ..
Image credit: Getty
లియోనెల్ మెస్సీతో రెండేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది పారిస్ సెయింట్ జెర్మన్. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఏటా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.306 కోట్ల 80 లక్షలకు పైగా) చెల్లిస్తోంది పీఎస్‌జీ.. అయితే తాజాగా అతని ప్రవర్తన కారణంగా ఈ కాంట్రాక్ట్‌ని పొడగించుకోవడానికి పారిస్ సెయింట్ సుముఖంగా లేదని తెలుస్తోంది..