కన్నీళ్లతో బార్సీలోనాకి వీడ్కోలు తెలిపిన మెస్సీ... కాంట్రాక్ట్ సగం తగ్గించుకుంటానని చెప్పినా...

First Published | Aug 8, 2021, 5:06 PM IST

తన ప్రొఫెషనల్ కెరీర్‌ మొత్తం బార్సీలోనాలో గడిపిన లియోనెల్ మెస్సీ...

2003 నుంచి బార్సీలోనా తరపున ఆడుతున్న మెస్సీ... క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్...

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, బార్సీలోనా క్లబ్‌కి కన్నీళ్లతో వీడ్కోలు తెలిపాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌ మొత్తం బార్సీలోనాలో గడిపిన మెస్సీ, 34 ట్రోఫీలతో క్లబ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2003 నుంచి బార్సీలోనా తరపున ఆడుతున్న మెస్సీ... కన్నీళ్లతో క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు...

బార్సీలోనా క్లబ్, కెప్టెన్ మెస్సీకి ఒక్కో సీజన్‌కి 75 మిలియన్ల యూరోలు (దాదాపు 656 కోట్ల రూపాయలు) చెల్లిస్తోంది. ఇంత భారీ మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేమని బార్సీలోనా స్పష్టం చేయడంతో, మరో గత్యంతరం లేక క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు లియోనెల్ మెస్సీ...


‘బార్సీలోనాతో కొనసాగేందుకు నేనేం చేయగలనో, అదంతా చేశాను. ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ఇది తప్పడం లేదు. నా కెరీర్‌లో ఇది బాధకరమైన సందర్భం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను, ఓడిపోయాను, కానీ ఓడిపోయిన ప్రతీసారి, ప్రతీకారం తీర్చుకోవడానికి మరింత కసిగా ప్రయత్నించాను...

కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్లీ రాలేను. క్లబ్‌లో నా టైం అయిపోయింది. ఈ క్లబ్‌కి ఆరంగ్రేటం చేసినప్పుడు, అదే నాకు చాలా పెద్ద కల. నా జీవితంలో ఎప్పటికీ నా మొదటి మ్యాచ్‌ను మరిచిపోలేను... నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ నా వెంటే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడతాను...

బార్కా, లాపోర్కా క్లబ్స్ నా సాలరీని 30 శాతం తగ్గించుకొమ్మని కోరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ ఫేక్... నిజానికి నా కాంట్రాక్ట్‌‌ను 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధమయ్యాను. వాళ్లకి అంతకంటే ఇంకేం కావాలి...

నాకు బార్సీలోనాతో ఎలాంటి సమస్యా లేదు. ఇది నా క్లబ్ అనే భావన ఉండేది. ప్రతీదానికి ఒప్పందం ఉండేది. లీగా రూల్స్ కారణంగా బార్కాలో ఉండలేకపోతున్నా... ’ అంటూ తెలిపాడు లియోనెల్ మెస్సీ. 

 బార్సీలోనా క్లబ్‌ తరుపున ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో క్లబ్‌ని వీడుతున్న విషయాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతీ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేసింది. 

Latest Videos

click me!