లియాండర్ పేస్‌కి ఊహించని షాక్... సంజయ్ దత్ మాజీ భార్య రియా పిల్లయ్‌‌ గృహహింస కేసులో...

First Published | Feb 25, 2022, 7:28 PM IST

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌పై 8 ఏళ్ల క్రితం గృహ హింస కేసు వేసిన మోడల్ రియా పిల్లయ్‌కి ముంబై కోర్టు ఊరట నిచ్చింది. 2014లో నమోదైన ఈ కేసులో లియాండర్ పేస్‌ తప్పు చేశాడని అంగీకరించనట్టు పేర్కొంది...

మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ గెలిచిన భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన ఏకైక భారత పురుష టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నాడు...

టెన్నిస్ స్టార్‌గా ఎదుగుతున్న రోజుల్లోనే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మాజీ భార్య రియా పిల్లయ్‌తో ఎఫైర్ నడిపంచాడు లియాండర్ పేస్...


2000వ సంవత్సరంలో రియా పిల్లయ్, లియాండర్ పేస్ కలిసి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ప్రకటించింది. ఈ ఇద్దరికీ అయానా అనే ఓ కూతురు కూడి పుట్టింది...

అయితే 2014లో లియాండర్ పేస్‌పై గృహ హింస కేసు పెట్టింది రియా పిల్లయ్. ఈ కేసుపై 8 ఏళ్ల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం... లియాండర్ పేస్‌కి వ్యతిరేకంగా తీర్పు నిచ్చింది...
 

లియాండర్ పేస్ తనను మాటలతో, ఎమోషనల్‌గా, ఎకానమికల్‌గా కూడా దెబ్బ తీశాడని, అతని వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని ఆరోపించింది రిచా పిల్లయ్.

లియాండర్ పేస్ తన తప్పును అంగీకరించడంతో ప్రతీ నెలా అద్దె రూపంలో రూ.50 వేలు, మెయింటనెన్స్ రూపంలో రూ.1 లక్ష రియా పిల్లెయ్‌కి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది మెట్రోపాలిటిన్ న్యాయస్థానం...

ఒకవేళ ఆమె బాంద్రాలోని వారిద్దరి ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకుంటే, ఈ నగదు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది కోర్టు...

టెన్నిస్ కెరీర్‌ ముగిసి పోయిన ఈ సమయంలో లియాండర్ పేస్‌ అద్దె ఇంట్లో ఉంటూ, ఆమెకి ఇంత భారీ మొత్తం చెల్లించమంటే అతను భరించలేడని చెప్పుకొచ్చింది న్యాయస్థానం...

రిచా పిల్లయ్‌తో బ్రేకప్ తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్న లియాండర్ పేస్, ప్రస్తుతం బాలీవుడ్ నటి, యువరాజ్ సింగ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు..

Latest Videos

click me!