Priyanka Ingle
Who is Priyanka Ingle: ఖో ఖో ప్రపంచ కప్ 2025కి భారత్ వేదిక కానుంది. ఈ మెగా టోర్నమెంట్ జనవరి 13 నుండి 19 వరకు దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలోనే ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) రాబోయే ఖో ఖో ప్రపంచ కప్ 2025లో కోసం భారత పురుషుల, మహిళల జట్లను అధికారికంగా ప్రకటించింది.
టీమిండియా కెప్టెన్లుగా ప్రతీక్ వైకర్, ప్రియాంక ఇంగ్లే
ఖోఖో పురుషుల భారత జట్టు కెప్టెన్‌గా ప్రతీక్ వైకర్ నియమితులయ్యారు. చారిత్రాత్మక ఈ క్రీడా ఈవెంట్ ప్రారంభ ఎడిషన్‌లో మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే కెప్టెన్‌గా ఎంపికైంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మహిళా జట్టు లీడర్‌గా ఎంపికైనందుకు ప్రియాంక ఇంగ్లే సంతోషం వ్యక్తంచేసింది.
భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన తర్వాత ప్రియాంక ఇంగ్లే మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తంచేశారు. "ఇది మొదటి ప్రపంచ కప్.. నేను మహిళల జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను, ఇది నిజంగా గొప్ప అనుభూతి. రాబోయే సంవత్సరాల్లో ఖో ఖో మన దేశంలో మరింత ఎదుగుతుంది. జూనియర్లు కష్టపడి సాధన చేయాలి, ఎందుకంటే వారికి ఆసియా లేదా కామన్వెల్త్ గేమ్స్ లేదా ఒలింపిక్స్‌లో కూడా ఆడే అవకాశాలు రావచ్చు" అని ప్రియాంక ఇంగ్లే చెప్పినట్టు పీటిఐ నివేదించింది.
Kho Kho World Cup
ఛాంపియన్ గా నిలవడమే లక్ష్యం
గత 8 సంవత్సరాలుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక ఇంగ్లే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖో ఖో ప్రపంచ కప్ 2025లో జాతీయ జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా టోర్నీ తొలి టైటిల్ ను భారత్ కు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎవరీ ప్రియాంక ఇంగ్లే?
ప్రియాంక ఇంగ్లే 5 సంవత్సరాల వయస్సు నుంచి లో ఖో ఖో ఆడటం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె గత 15 సంవత్సరాలుగా ఖోఖోలో నైపుణ్యం సాధించాడు. ఈ యంగ్ ఖో ఖో క్రీడాకారిణి నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వారి జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.
Kho Kho
అనేక సవాళ్ల నుంచి కెప్టెన్ గా ఎదిగిన ప్రియాంక ఇంగ్లే
ప్రియాంక ఇంగ్లే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తాను కెప్టెన్ గా ఈ స్థాయికి రావడానికి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు భారత జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఇంగ్లే దేశంలోని అత్యుత్తమ ఖో ఖో క్రీడాకారిణులలో ఒకరిగా ఎదిగేందుకు ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించగలిగింది.
సబ్-జూనియర్ నేషనల్ ఖో ఖో టోర్నమెంట్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో మహారాష్ట్రలో 23 ఏళ్ల మొదటి ప్లేయర్ గా కొత్త రికార్డు సాధించింది. ఈ టోర్నీలో ప్రియాంక ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా అవార్డును అందుకుంది. 2022లో సీనియర్ నేషనల్స్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో ప్రియాంక ఇంగ్లే రాణి లక్ష్మీబాయి అవార్డును అందుకుంది.
ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ప్రియాంక ఇంగ్లే
2016లో జరిగిన ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియాతో కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు ప్రియాంక అంతర్జాతీయంగా పెద్ద విజయాన్ని సాధించింది. 2022-23 టోర్నమెంట్ ఎడిషన్‌లో ప్రియాంక భారత మహిళల జట్టుతో కలిసి రజత పతకాన్ని గెలుచుకుంది.
ప్రియాంక 7వ తరగతి చదువుతున్నప్పుడు 12 ఏళ్ల నుంచి జాతీయ స్థాయిలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రియాంక ఇంగ్లే తన కెరీర్‌లో ఇప్పటివరకు 23 జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంది. ఖోఖోలో రాణిస్తూనే చదువుల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. పూణేలో జన్మించిన ప్రియాంక ఇంగ్లే M.Com లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు.
ఖో ఖో వరల్డ్ ప్రపంచ కప్ 2025లో భారత మహిళల జట్టు:
ప్రియాంక ఇంగ్లే (కెప్టెన్), అశ్విని షిండే, రేష్మా రాథోడ్, భిలార్ దేవ్‌జీభాయ్, నిర్మలా భాటి, నీతా దేవి, చైత్ర ఆర్., శుభశ్రీ సింగ్, మగాయ్ మాఝీ, అన్షు కుమారి, వైష్ణవి బజరంగ్, నస్రీన్ షేక్, మీను, మోనికా, నజియా బీబీ.