ఇంగ్లాండ్‌లో పేట్రేగిన జాత్యాహంకారం... యూరో 2020 ఓటమి తర్వాత నల్లజాతీయులపై...

First Published Jul 13, 2021, 11:12 AM IST

యూరో 2020 ఫైనల్‌లో ఇటలీ చేతుల్లో ఇంగ్లాండ్ పరాజయం... ఆ దేశంలో మరోసారి జాత్యాహంకారాన్ని తెర లేపింది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో జరిగిన జాత్యాహంకార సంఘటనల తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయి...

యూరో 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి తర్వాత ఇంగ్లీష్ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. రోడ్లపైన నగ్నంగా తిరుగుతూ ఆందోళనలు చేసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్, ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేశారు...
undefined
అంతేకాదు ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమికి జట్టులోని నల్ల జాతీయులే కారణమనే ఉద్దేశంతో... బ్లాక్ మెన్‌పై దాడులకు దిగారు. జాతీయ పతకాన్ని కాలుస్తూ, పడేసి తొక్కుతూ అవమానించారు...
undefined
ఇంగ్లాండ్ అభిమానుల విపరీత చర్యలు అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా నల్లజాతీయులపై తీవ్ర స్థాయిలో దూషణలకు పాల్పడుతున్నారు. వారిని బూతులు తిడుతూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు...
undefined
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించాడు. ‘మొట్టమొదటిసారి ఇంటికి వెళ్లేటప్పుడు భయమేసింది. ఇది భయంకరం. మనం 2021లోనే ఉన్నామా? ఆటగాళ్లను తిడుతే, దూషిస్తే మీక ఆనందం వస్తుందా?’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్...
undefined
‘నల్లజాతీయులపై దూషణలు చేసిన ట్వీట్లు రోబోలు చేసినవి కావు, ఫేక్ అకౌంట్స్ కూడా కావు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ప్రపంచంలోనే శక్తివంతమైన బ్రిటీష్ మీడియా, సోషల్ మీడియాను కంట్రోల్ చేయగలదని అనుకుంటున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్.
undefined
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అభిమానుల చర్యలను ఖండించాడు. ‘ఇలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవాళ్లు సిగ్గుపడాలి... ఆటలో గెలుపు, ఓటములు సహజం. ఓడించిన వారిని నిందించడం దుర్మార్గ చర్య’ అంటూ ట్వీట్ చేశాడు బోరిస్...
undefined
తనపై వచ్చిన ట్రోలింగ్‌కి సోషల్ మీడియా ద్వారానే సమాధానం ఇచ్చాడు ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్... ‘నా పేరు మార్నస్ రాష్‌ఫోర్డ్, 23 ఏళ్ల, నేను నల్లజాతీయుడిని’.. అంటూ సుదీర్ఘ లేఖలో పెనాల్టీ గోల్ మిస్ అయినందుకు మీరెంత బాధపడుతున్నారో, తాను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు తెలిపాడు...
undefined
click me!