బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా పనికి రాడు, అతనికి కెప్టెన్సీ ఇవ్వండి... షోయబ్ అక్తర్ కామెంట్...

Published : Jul 13, 2021, 09:54 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడి, వన్డే సిరీస్ కోల్పోయింది పాకిస్తాన్ జట్టు. ఇంగ్లాండ్ పిచ్‌లపైన గెలవడం అంత ఈజీ కాకపోయినా పాక్ ఆడిన తీరు, తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమవుతోంది...

PREV
19
బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా పనికి రాడు, అతనికి కెప్టెన్సీ ఇవ్వండి... షోయబ్ అక్తర్ కామెంట్...

ఇంగ్లాండ్ సీ టీమ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లోనూ 200+ స్కోరు కూడా చేయలేకపోయిన పాక్ జట్టు, బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో ఏ మాత్రం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది...

29

విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి వన్డేల్లో నెం.1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, తొలి వన్డేలో డకౌట్ కాగా, రెండో వన్డేలో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

39

పాక్ టీమ్ టీ20లు తప్ప, మరే ఫార్మాట్ పనికి రాదని... అందులో స్టార్ ప్లేయర్లు ఎవ్వరూ లేరని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, బాబర్ ఆజమ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.

49

‘బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా పనికి రాదు. అతను కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే. జట్టును నడిపించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు అతనిలో ఏ మాత్రం కనిపించడం లేదు...

59

ప్రస్తుతం జట్టులో ఉన్నవారిలో పేసర్ హసన్ ఆలీలో మాత్రమే ఆ మెరుపు, తెలివి కనిపిస్తున్నాయి. నేను బోర్డులో ఉండి ఉంటే నా నిర్ణయం ఇలాగే ఉండేది...

69

బాబర్ ఆజమ్‌‌పై కెప్టెన్సీ భారాన్ని తొలగిస్తే అతను గ్రేట్ బ్యాట్స్‌మెన్ అవుతాడు. కెప్టెన్ అయ్యాక అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు... 

79

ఇంగ్లాండ్ జట్టు వేరే లెవెల్‌లో ఆడుతోంది. పూర్తిగా కొత్త జట్టుతో ఇంత తక్కువ సమయంలో ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే అంత తేలికయ్యే విషయం కాదు...

89

అదే టైంలో పాకిస్తాన్ జట్టు ఇంకా 1970ల్లో ఉన్నట్టుగా ఆడుతోంది. మనం బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో క్రికెట్ ఆడుతున్నాం... అందుకే మిగిలిన జట్లు మనకంటే ముందున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్...

99

కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో వన్డేలో 15 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటైతే హసన్ ఆలీ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

click me!

Recommended Stories