RCB: ఐపీఎల్ 2026 ఆక్షన్ దగ్గర పడుతున్న కొద్ది ఫ్రాంచైజీల మధ్య ప్లేయర్ ట్రేడ్ డీల్స్ రూమర్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక మంది కీలక ఆటగాళ్లు తమ జట్లను మార్చుకోబోతున్నారని గట్టిగా స్పెక్యులేషన్ నడుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును వీడాలని నిశ్చయించుకున్నట్లు ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ యాజమాన్యం అతని ట్రేడ్ కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ, మిగిలిన జట్ల ముందు వారు పెడుతున్న భారీ డిమాండ్ల వల్ల డీల్స్ కొలిక్కి రావడం లేదు. చాలా జట్లు శాంసన్‌ను తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఈ డిమాండ్ల కారణంగా వెనకడుగు వేస్తున్నాయి. ట్రేడ్ కుదరకపోయినా, శాంసన్ ఆర్ఆర్ తో ఉండేది లేదని స్పష్టంగా తెలుస్తోంది. అంటే అతను మెగా ఆక్షన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది.
25
గుజరాత్ టైటాన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు
తాజా అప్‌డేట్ ప్రకారం వాషింగ్టన్ సుందర్ దాదాపుగా చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తున్నాడు. ఈ ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. సీఎస్కేకు అశ్విన్ స్థానంలో ఒక ఆఫ్ స్పిన్నర్ అవసరం. వాషింగ్టన్ సుందర్ చెన్నైకి చెందినవాడు కావడంతో సీఎస్కేకి చాలా ప్రయోజనం. పైగా, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం సుందర్ కి చెల్లిస్తున్న 3.2 కోట్ల రూపాయలకే సీఎస్కే అతనిని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.
35
కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి వెంకటేష్ అయ్యర్..
వెంకటేష్ అయ్యర్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రేడ్ కోసం మూడు జట్లతో చర్చలు జరుపుతోందని రూమర్స్ ఉన్నాయి. కేకేఆర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో అయ్యర్ బదులుగా కేఎల్ రాహుల్‌ను ఇవ్వమని ఆఫర్ చేసింది. కానీ డీసీ అంగీకరించలేదు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు గట్టిగా వినిపిస్తోంది. గత మెగా ఆక్షన్‌లో ఆర్‌సీబీ అయ్యర్ కోసం 23 కోట్ల రూపాయల వరకు బిడ్ చేసింది. అయితే, ఆర్‌సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి, వారి జట్టు దాదాపు సెట్ అయింది. అయినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కొరత ఉండటంతో అయ్యర్ లాంటి ఆటగాడి కోసం కొంత ఆసక్తి చూపిస్తోంది.
ఇషాన్ కిషన్ కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మూడు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. కేకేఆర్‌కు సరైన ఇండియన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ లేడు, గతంలో కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ కోసం ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతోంది. కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇషాన్ కిషన్‌ను తీసుకుని, వెంకటేష్ అయ్యర్‌ను ఇవ్వాలని చూస్తోంది. ఇషాన్ కిషన్ ప్రస్తుత ధర 11.5 కోట్లు. అయితే, ఎస్‌ఆర్‌హెచ్ ఈ ట్రేడ్‌కు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే వారికి మరో ఎడమచేతి వాటం ఆటగాడు అవసరం లేదు. ఇషాన్ కిషన్ ప్రస్తుత ఫామ్ బాగుంది. టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.
55
మిగిలిన ప్లేయర్స్ ట్రేడ్ ఇలా..
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మాక్స్‌వెల్ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ మాక్స్‌వెల్‌ను వదులుకోవడానికి ఇష్టపడుతుందో లేదో చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్దూల్ ఠాకూర్‌ను ట్రేడ్ చేసుకోవడానికి సీఎస్కే ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ ప్లేయర్ అశుతోష్ శర్మ కోసం పీబీకేఎస్, ముంబై వికెట్ కీపర్ రాబిన్ మిన్స్ కోసం సీఎస్కే, ఆర్‌సీబీలో ఉన్న మనోజ్ పాండే కోసం లక్నో ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.