IPL 2026: డాడీస్ జట్టులోకి పోటుగాడు వచ్చాడోచ్.. ఈసారి చెన్నై ఛాంపియన్‌గా నిలుస్తుందా.?

Published : Mar 26, 2026, 08:00 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది. సంజూ శాంసన్ జట్టులోకి రావడంతో సిఎస్కే బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతమైంది. పాత, కొత్త ఆటగాళ్ల కలయికతో ఉన్న ఈ జట్టు ఎలా ఉండబోతోందంటే.? 

PREV
15
ఐపీఎల్ 2026లో సిఎస్కే జట్టు

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంఎస్ ధోనీ సారధ్యంలో ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సిఎస్కే, గత సీజన్‌లో కేవలం 4 మ్యాచులు మాత్రమే గెలిచి నిరాశపరిచింది. అయితే, 2026 సీజన్ కోసం పాత, కొత్త ఆటగాళ్ల కలయికతో ఒక శక్తివంతమైన జట్టును సిద్ధం చేసుకుంది.

25
జట్టులోని కీలక మార్పులు - సంజూ శాంసన్ ఎంట్రీ:

ఈ సీజన్ లో చెన్నై జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సంజూ శాంసన్ జట్టులోకి రావడం. టీ20 ప్రపంచకప్ గెలిపించిన హీరో కావడంతో పాటు, ప్రస్తుతం మూడు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ఊరట. సంజూ శాంసన్, మాథ్యూ షార్ట్ ఓపెనర్లుగా వస్తే పవర్ ప్లేలో భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.

35
బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ బలాలు

చెన్నై బ్యాటింగ్ విభాగం సీనియర్లు, యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది..

సీనియర్లు: రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ, సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి అనుభవజ్ఞులు జట్టుకు వెన్నెముకగా ఉన్నారు.

యువ సంచలనాలు: కార్తీక్ శర్మ, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి ప్రతిభావంతులైన యంగ్ బ్యాటర్లను భారీ ధర వెచ్చించి సిఎస్కే కొనుగోలు చేసింది.

ఫినిషర్లు: 5, 6వ స్థానాల్లో శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు.

45
బౌలింగ్, ఆల్ రౌండర్లు

బౌలింగ్ విభాగంలో మ్యాటీ హెన్రీ పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో సిద్ధహస్తుడు. అతడికి ఖలీల్ అహ్మద్ తోడవ్వడం బౌలింగ్ అటాక్ ను మరింత పటిష్టం చేసింది. స్పిన్ విభాగంలో అకిల్ హొసైన్, ప్రశాంత్ వీర్ వంటి ఆల్ రౌండర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లోనూ రాణించగలరు.

55
తుది 11 మంది ఎంపికే..

ధోనీ అనుభవం, రుతురాజ్ నాయకత్వం, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ల రాకతో సిఎస్కే మళ్ళీ తన జైత్రయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 25 మంది ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో తుది 11 మంది ఎంపికే అత్యంత కీలకం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories