భవానీ దేవి తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన టోర్నీల్లో పతకాలు సాధించింది. మలేషియాలో జరిగిన 2009 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో ప్రారంభించి, ఆమె 2010 ఇంటర్నేషనల్ ఓపెన్, థాయ్‌లాండ్‌ను గెలుచుకుంది. 2010 క్యాడెట్ ఆసియా ఛాంపియన్‌షిప్, ఫిలిప్పీన్స్; 2012 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్, జెర్సీ; 2015 అండర్-23 ఆసియా ఛాంపియన్‌షిప్, ఉలాన్‌బాతర్, మంగోలియా మరియు 2015 ఫ్లెమిష్ ఓపెన్‌లలో కాంస్య పతకాలను గెలుచుకుంది. 2014లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన అండర్-23 విభాగంలో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు.