పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ గెలిచిన 6 మెడ‌ల్స్ లో 4 హ‌ర్యానా ఆటగాళ్లు సాధించిన‌వే.. !

First Published | Aug 12, 2024, 10:15 PM IST

Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త్ త‌ర‌ఫున హర్యానా ప్లేయర్స్ హ‌వా చూపించాడు. భారత్ మొత్తం 6 పతకాలు సాధించగా, అందులో 4 మెడ‌ల్స్ హర్యానా ఆటగాళ్లు గెలిచారు.  

Paris Olympic 2024 - India : పారిస్ వేదికగా జ‌రిగిన విశ్వ క్రీడ‌లు (పారిస్ ఒలింపిక్స్) ముగిశాయి. 17 రోజుల పాటు సాగిన ప్రపంచ క్రీడలు ఆగస్టు 11న ఘ‌నంగా వేడుక‌ల మ‌ధ్య ముగిశాయి. టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన మెడ‌ల్స్ కు డ‌బుల్ సంఖ్య‌లో గెలుచుకోవాల‌ని భార‌త్ పారిస్ ఒలింపిక్స్ లో అడుగు పెట్టింది. కానీ, కేవ‌లం 6 మెడ‌ల్స్ తోనే స‌రిపెట్టుకుంది. 

పారిస్ ఒలింపిక్స్ 2024 భార‌త్ గెలిచిన ఆరు మెడ‌ల్స్ లో హర్యానాకు చెందిన ఆట‌గాళ్లు హవా కనిపించింది. భారత్ సాధించిన మొత్తం మెడ‌ల్స్ లో 4 హ‌ర్యానా ప్లేయ‌ర్లు సాధించారు. భారత్‌కు పతకాలు సాధించిపెట్టి దేశానికి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు. మెడ‌ల్స్ సాధించిన హ‌ర్యానా క్రీడాకారుల వివ‌రాలు గ‌మ‌నిస్తే రెండు మెడ‌ల్స్ తో మ‌ను భాక‌ర్ ముందున్నారు. 


మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించిన మను భాకర్ పేరు ఈ జాబితాలో మొదటిది. మను భాకర్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మను భాకర్ హర్యానాలోని ఝజ్జర్ ప్రాంతానికి చెందిన వారు. 

నీరజ్ చోప్రా

జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ కూడా హర్యానాకు చెందినవాడు. నీరజ్ హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన అథ్లెట్. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన నీర‌జ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించాడు. 

అమన్ సెహ్రావత్

రెజ్లింగ్‌లో దేశానికి కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ కూడా హర్యానాకు చెందినవారే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుల్లో పతకం సాధించిన వారిలో అమ‌న్ ఒక‌రు. చిన్న వ‌య‌స్సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన అమ‌న్ నేడు ప్ర‌పంచ వేదిక‌పై త్రివ‌ర్ణ పతాకాన్ని రెప‌రెప‌లాడించాడు. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. 

భార‌త హాకీ జట్టు

భార‌త హాకీ జ‌ట్టు చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఒలింపిక్ మెడ‌ల్స్ గెలుచుకుంది. టోక్యోలో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన భార‌త్.. పారిస్ ఒలింపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడ‌ల్ సాధించింది. ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులోని పలువురు ఆటగాళ్లు హ‌ర్యానా నుంచి కూడా ఉన్నారు. వారిలో సుమిత్, అభిషేక్ నైన్, సంజయ్ వంటి  కీల‌క ఆటగాళ్లు ఉన్నారు. 

Latest Videos

click me!