Published : Sep 22, 2025, 09:26 AM ISTUpdated : Sep 22, 2025, 09:43 AM IST
India vs Pakistan Highlights : ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టాప్ 5 మ్యాజిక్ మూమెంట్స్ ఇవే…
Asiacup 2025, IND VS PAK : పాకిస్థాన్ కు ఇండియాపై ఓడిపోవడం అలవాటుగా మారిపోయింది. ఆసియాకప్ 2025 ఆరంభంలోనే దాయాది దేశానికి ఓ ఓటమి రుచి చూపించిన టీమిండియా ఆదివారం మరోసారి ఓడించింది. కీలకమైన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే సూర్య సేన అలవోకగా ఛేదించింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ హైలైట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
1. బంతితో శివమ్ దూబే మ్యాజిక్
టీమిండియా విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. అతడి అద్భుత బౌలింగ్ పాకిస్థాన్‌ను 171/5 స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా మారింది. సైమ్ అయూబ్, సాహిబ్జాదా వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు పడగొట్టాడు.
36
2. టీమిండియా చెత్త ఫీల్డింగ్
పాకిస్థాన్‌పై భారత్ విజయంలో టీమిండియా చెత్త ఫీల్డింగ్ ప్రధాన చర్చనీయాంశమైంది. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు జారవిడిచారు. అయినా పాక్‌ను 171 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఈ క్యాచ్ లు పట్టివుంటే 150 పరుగులకే పాక్ తోకముడిచేది... భారత్ మరింత ఈజీగా ఘనవిజయం సాధించేది. భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతాలు చేస్తున్నా ఫీల్డింగ్ విషయంలో మాత్రం మెరుగుపడటం లేదు… ఇది ఫ్యాన్స్ ను కాస్త కంగారుపెడుతోంది.
గత మూడు మ్యాచుల్లో 30+ స్కోర్లు చేసిన అభిషేక్ శర్మ వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 74 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో భారత్ కు లక్ష్యచేధన ఈజీ అయ్యింది. అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్ అభిమానులను మరింత ఉర్రూతలూగించింది.
56
4. ఆదుకున్న హైదరబాదీ ప్లేయర్
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. 19 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు… జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి క్రీజులో ఉన్నది కొద్దిసేపే… కానీ ఉన్నతసేపు బ్యాట్ కు గట్టిగానే పనిచెప్పాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ తెలుగోళ్లను గర్వపడేలా చేసింది.
66
5. పాకిస్థాన్ పై టీమిండియా ఆధిపత్యం
ఆసియా కప్ 2025 లో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల విజయంతో టీమిండియా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. టీ20ల్లో పాక్‌తో జరిగిన 15 మ్యాచ్‌ల్లో భారత్‌కి ఇది 12వ విజయం. వరుసగా ఏడో గెలుపు. ఇలా పాకిస్థాన్ పై భారత్ విజయపరంపర కొనసాగుతోంది.