పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ vs పాక్ ఢీ.. జావెలిన్ త్రో ఫైన‌ల్ కు నీర‌జ్ చోప్రా

First Published | Aug 6, 2024, 4:49 PM IST

Neeraj Chopra vs Arshad Nadeem : టీమిండియా 'గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024 అథ్లెటిక్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో తన మొదటి త్రోను 89.34 మీటర్ల దూరంలో విసిరాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ త్రో ఇదే. దీంతో నీరజ్ నేరుగా ఫైనల్ కు చేరుకున్నాడు. 
 

Javelin Throw, Arshad Nadeem, Neeraj Chopra

India's Golden Boy Neeraj Chopra : నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024 అథ్లెటిక్స్ జావెలిన్ త్రో లో స‌త్తా చాటాడు. టీమిండియా 'గోల్డెన్ బాయ్'గా గుర్తింపు పొందిన‌ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో త‌న మొద‌టి ప్ర‌ద‌ర్శ‌న‌ను అద్భుతంగా మొద‌లుపెట్టాడు. జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతను తన మొదటి త్రోను 89.34 మీటర్ల దూరంలో విసిరాడు. ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ త్రో ఇదే. నీరజ్ తొలి త్రోతోనే ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.

అలాగే, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 86.59 మీటర్లు విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. నీరజ్ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 8న రాత్రి 11:50 గంటలకు జరగనుంది. వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించాలని యావ‌త్ భార‌తావ‌ని ఆకాంక్షిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడ‌ల్ తో చరిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. 


నీరజ్ అద్భుతమైన ఆరంభం.. 

మంగళవారం జరిగిన గ్రూప్ బి క్వాలిఫికేషన్ రౌండ్‌లో చోప్రా 89.34 మీటర్ల త్రో విసిరి శుభారంభం చేశాడు. తొలి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అతని తర్వాత పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ కూడా ఫైనల్ చేరాడు. అతను తన మొదటి ప్రయత్నంలోనే క్వాలిఫికేషన్ స్టాండర్డ్ దూరాన్ని అధిగ‌మించాడు. నదీమ్ 86.59 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో నదీమ్ 90 మీటర్ల మార్కును కూడా అధిగ‌మించాడు.

Paris Olympics 2024, Neeraj Chopra

ఫైన‌ల్ లో భార‌త్-పాక్ ఢీ..  

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రేప్ బీ లో మ‌రోసారి దాయాదుల పోరు సాగ‌నుంది. ఇరు దేశాల‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్లు నీర‌జ్ చోప్రా, అర్ష‌ద్ న‌దీమ్ లు క్వాలిఫికేష‌న్ రౌండ్ లో క్వాలిఫై మ‌ర్కును దాటి త్రో వేశారు. దీంతో ఈ ఇద్ద‌రు ఫైల‌న్ కు చేరారు.

నీర‌జ్ చోప్రా-అర్ష‌ద్ న‌దీమ్ లు ఇద్ద‌రు చాలా టోర్న‌మెంట్ ల‌లో త‌ల‌ప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రంగా ఫైట్ జ‌రిగింది. చాలా  సంద‌ర్భాల్లో వీరిద్ద‌రూ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు మ‌రోసారి పారిస్ ఒలింపిక్స్ 2024లో త‌ల‌ప‌డ‌నున్నారు. 

నీరజ్ కెరీర్ సాగింది ఇలా.. 

నీరజ్ చోప్రా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 2022లో ఈ టోర్నీలో రజత పతకాన్ని సాధించి విజయం సాధించాడు. 2022 డైమండ్ లీగ్‌లో నీరజ్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2023లో రెండో స్థానంలో నిలిచాడు. 2018, 2022 ఆసియా క్రీడల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.

Neeraj Chopra and Arshad Nadeem

అర్ష‌ద్ న‌దీమ్ రికార్డులు ఇవి.. 

దక్షిణాసియా క్రీడలు 2016, గౌహతి, ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ 2016, హో చి-మిన్ ఈవెంట్ లో నదీమ్ 3 స్థానంలో నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023, బుడాపెస్ట్ లో రెండో స్థానంలో నిలాచాడు.     ఇవే కాకుండా చాలా ఈవెంట్లలో టాప్-5 లో నిలిచాడు. 

నీరజ్ చోప్రా వర్సెస్ అర్షద్ నదీమ్ 

నీరజ్ చోప్రా వర్సెస్ అర్షద్ నదీమ్ ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోలు గమనిస్తే ఇందులో నీరజ్ చోప్రా కంటే అర్షద్ నదీమ్ ముందున్నాడు. నీరజ్ చోప్రా వ్యక్తిగత అత్యుత్తమ త్రో 89.94 మీటర్లు. దీనిని స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022లో సాధించాడు. ఇక అర్షద్  నదీమ్ కామన్వెల్త్ గేమ్స్ 2022, బర్మింగ్‌హామ్ లో తన అత్యుత్తమ త్రో 90.18 మీటర్లను నమోదుచేశాడు.

Latest Videos

click me!