ఆసియా కప్ హాకీ 2025: ఛాంపియన్ గా భారత్.. కొరియాపై 4-1తో సూపర్ విక్టరీ

Published : Sep 07, 2025, 10:01 PM IST

Asia Cup Hockey 2025: బీహార్ రాజ్‌గిర్ లో జరిగిన ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. ఎనిమిదేళ్ల తర్వాత నాలుగోసారి హాకీ ఆసియా కప్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది.

PREV
15
రాజ్‌గిర్ లో భారత్ చారిత్రాత్మక విజయం

ఆసియా కప్ హాకీ 2025 భారత్ చరిత్ర సృష్టించింది. కొరియాన్ చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అద్బుత విజయంతో భారత జట్టు అదరగొట్టింది. 

ఆసియా కప్ హాకీ 2025 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత నాలుగోసారి కప్ గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ 2026లో జరిగే FIH హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది.

25
మొదటి నిమిషంలోనే భారత్ దాడి

ఆరంభం నుంచే భారత్ దూకుడు చూపించింది. మొదటి నిమిషంలోనే సుఖ్ జీత్ సింగ్ అద్భుతమైన స్ట్రైక్‌తో గోల్ చేసి భారత జట్టుకు ఆధిక్యం అందించాడు. జుగ్రాజ్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను మిస్ చేసినా, భారత్ ఒత్తిడి కొనసాగించింది. హాఫ్ టైమ్‌కి ముందు దిల్ ప్రీత్ సింగ్ గోల్ చేసి స్కోరును 2-0కి చేర్చాడు.

35
మూడో, నాలుగో క్వార్టర్లలో భారత్ ఆధిపత్యం

మూడో క్వార్టర్‌లో రాజేందర్ సింగ్ శాంతంగా గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-0కి పెంచాడు. నాలుగో క్వార్టర్ ప్రారంభంలో అమిత్ రోహిదాస్ పెనాల్టీ కార్నర్‌ను విజయవంతంగా మార్చి నాలుగో గోల్ సాధించాడు. కొరియా చివర్లో ఓ కాన్సొలేషన్ గోల్ సాధించినా, భారత్ ఆత్మవిశ్వాసంగా మ్యాచ్ ముగించింది.

45
భారత ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు

దిల్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిసి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, "ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా కప్ గెలవడం ప్రత్యేకం. టోర్నీ ఆరంభం నుంచే మా ప్రధాన లక్ష్యం ఇక్కడ కప్ గెలిచి వరల్డ్ కప్ అర్హత పొందడమే" అన్నారు. సుఖ్ జీత్, అమిత్ రోహిదాస్ కీలక సమయాల్లో గోల్స్ చేసి భారత్ కు విజయాన్ని ఖరారు చేశారు.

55
ఆసియా కప్ చరిత్రలో భారత్ ప్రత్యేక స్థానం

భారత్ 2003, 2007, 2017 తర్వాత ఇప్పుడు 2025లో నాలుగోసారి ఆసియా కప్ గెలిచింది. ఈ విజయంతో ఆసియా హాకీలో భారత్ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. గతంలో పాకిస్థాన్, దక్షిణ కొరియా పలు సార్లు టైటిల్ గెలిచాయి. కానీ ఈసారి భారత జట్టు టోర్నమెంట్ అంతా అజేయంగా నిలిచి ఫైనల్లో విజేతగా నిలిచింది.

ఈ విజయం భారత్‌కు పెద్ద ఉత్సాహాన్ని అందించింది. కోచ్ క్రేగ్ ఫుల్టన్ వ్యూహాత్మక మార్పులు, ఆటగాళ్ల సమతుల్య ప్రదర్శన వల్లే ఈ ఫలితం సాధ్యమైంది. ఆసియా కప్‌లో ఆధిపత్యం చూపిన భారత్, ఇప్పుడు 2026 వరల్డ్ కప్‌లో మరింత బలంగా ముందుకు సాగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories