ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తుది సమరానికి సిద్ధమయ్యాయి. ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు సైతం మంచి బహుమతి దక్కనుంది. ఆ వివరాలేంటో చూద్దాం!
IND vs NZ: మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ ఈరోజు మధ్యాహ్నం పోటీ పడతాయి. 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది.
23
ట్రోఫీ గెలిస్తే ఎంతంటే..
గతంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో ఓడినందుకు బదులు తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ టోర్నీలో ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట.
33
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు
రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ. 4.86 కోట్లు దక్కుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ రూ.60 కోట్లు. లీగ్ దశలో గెలిచిన జట్టుకు 34,000 డాలర్లు (రూ.30 లక్షలు) వస్తాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3 కోట్లు దక్కుతాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2 కోట్లు వస్తాయి. ఈ టోర్నీలో పాల్గొన్నందుకు కనీసం రూ.1.08 కోట్లు దక్కుతాయి.