T20 World Cup: 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని సమాచారం. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఏడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారు.
2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ T20 ప్రపంచకప్‌ను నిర్వహించనున్నాయి. దీంతో మ్యాచ్‌లు రెండు దేశాల్లోనూ జరగనున్నాయి.
25
ఏడు వేదికలు షార్ట్‌లిస్ట్
ఐసీసీ ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం ఏడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో ఐదు వేదికలు భారతదేశంలో ఉండగా, మిగిలిన రెండు శ్రీలంకలో ఉన్నాయి. భారత్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన వేదికలలో నరేంద్ర మోదీ స్టేడియం(అహ్మదాబాద్), ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా), అరుణ్ జైట్లీ స్టేడియం(ఢిల్లీ), చెన్నై, ముంబై స్టేడియాలు ఉన్నాయి. ఈ స్టేడియంలు స్పిన్నర్లకు, బిగ్-హిట్టర్లకు అనుకూలంగా ఉంటాయని అంచనా.
35
ఓడిన చోటే మళ్లీ ఫైనల్ మ్యాచ్
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా అహ్మదాబాద్ అతిధ్యమిచ్చింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు అదే స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్ నిర్వహించబోతున్నారు. అటు ఈసారి బీసీసీఐ వరల్డ్ కప్ కోసం తక్కువ వేదికలు ఎంచుకుంది.
అలా చూస్తే.. ఈ స్టేడియాలలో ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అటు పాకిస్థాన్ మ్యాచ్‌లు, సెమీ-ఫైనల్స్ అన్నీ శ్రీలంకలోని వేదికల్లోనే నిర్వహించాలని ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ చేరితే, ఆ మ్యాచ్ కొలంబోలో జరగనుంది.
55
శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరుకుంటే..
శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌ను వారి స్వదేశంలోనే ఆడేలా ఐసీసీ నుంచి సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ త్వరలోనే ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు తెలుగు రాష్ట్రాలలోని ఒక్క స్టేడియం ఎంపిక కాకపోవడం గమనార్హం.