రోహిత్ మావాడు వదిలేదిలే..! ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్టు పెద్దదే.. పూర్తి వివరాలు

Published : Nov 07, 2025, 06:42 PM IST

Mumbai Indians: వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోర్ టీమ్‌ను నిలుపుకుంటూనే, ఆక్షన్ స్లాట్‌లు పెంచుకోవడానికి దాదాపు 13 మంది రిప్లేస్‌మెంట్..

PREV
15
ముంబై వ్యూహాలు

ముంబై ఇండియన్స్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం తమ ఆక్షన్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి క్వాలిఫైయర్ వరకు చేరుకున్నప్పటికీ, సీజన్ ప్రారంభంలో పేలవ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచింది. అయితే, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, తొలి ఐదు మ్యాచ్‌ల తర్వాత తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది.

25
13 మంది ఆటగాళ్లు వేలంలోకి

ప్రస్తుతం MIకి బలమైన కోర్ టీమ్ ఉంది. అయితే, జట్టులో చాలా మంది ఆటగాళ్లు రిప్లేస్‌మెంట్‌లుగా చేరారు. ఈ కారణంగా, ఆక్షన్ లో ఎక్కువ స్లాట్‌లు, పర్స్ విలువ కోసం ఎక్కువ మందిని విడుదల చేయాలని ముంబై నిర్ణయించుకుంది. దాదాపు 13 మంది ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేయనున్నారని టాక్.

35
వీరి రిలీజ్ పక్కా..

రిచర్డ్ గ్లీసన్, కార్బిన్ బాష్, ముజీబ్ ఉర్ రెహమాన్, చరిత్ అసలంక, జానీ బెయిర్ స్టో, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ బావా, రీస్ టోప్లీ, లిజాడ్ విలియమ్స్, అల్లాహ్ గజన్ఫర్ వంటి ఆటగాళ్లను ముంబై విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏది రాకపోయినప్పటికీ.. ఈ రిలీజ్ లిస్టు పక్కాగా కనిపిస్తోంది.

45
రీప్లేస్ మెంట్ ప్లేయర్స్ ఎక్కువ..

MI ప్రధానంగా రిప్లేస్‌మెంట్, తక్కువ ప్రభావం చూపిన లేదా గాయపడిన ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా తమ స్క్వాడ్‌ను పునర్‌నిర్మించుకోవాలని చూస్తోంది. ఇది వారిని ఆక్షన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు వీలు కల్పిస్తుంది. ఇక అటు రోహిత్ శర్మ కూడా ముంబై నుంచి విడుదల కానున్నాడని టాక్ నడిచింది.

55
రోహిత్ మావాడు..

ఇక ఈ రోహిత్ శర్మ విషయంలోనే స్వయంగా ముంబై ఇండియన్స్ అధికారిక ప్రకటన చేసింది. రోహిత్ శర్మను రిలీజ్ చేయట్లేదని.. ముంబైతోనే ఉంటాడని.. తమ జట్టులో రోహిత్ ఓ కీలక భాగమని స్పష్టం చేసింది. మినీ వేలంలో ఏయే ప్లేయర్స్‌పై ముంబై కన్నేస్తుందో మరి చూడాలి

Read more Photos on
click me!

Recommended Stories