టీంఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 నెలల విరామం తర్వాత తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. శుక్రవారం నాడు జరగబోయే తొలి టి20 మ్యాచ్ లో మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో శుక్రవారం టి20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హోదాలో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగబోతున్నాడు.
28
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్ లో విశ్రాంతినిచ్చారు. దీంతో యువ భారత జట్టును స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించ బోతున్నాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఆడుతున్నాడు.
38
వెన్నులో గాయం, ఆపరేషన్, రిహాబిలిటేషన్ సెంటర్... అంటూ చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా టీమ్ ఇండియా సారధిగా ఆటలో తిరిగి అడుగుపెట్టబోతున్నాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రా ఎలా రాణిస్తాడో అని అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి.
48
తొలి టీ20 ఆట ప్రారంభానికి ముందు ఫ్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో బుమ్రా మాట్లాడాడు. చాలాకాలం తరువాత కమ్ బ్యాక్ నేపథ్యంలో.. తన ఫిట్నెస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని బుమ్రా చెప్పాడు. గాయం తర్వాత తొలి మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని అన్నాడు.
58
విలేకరుల సమావేశంలో జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ… తిరిగి భారత జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘నేను ఇప్పుడు 100% ఫిట్నెస్తో ఉన్నాను. ఎన్సీఏలో సుదీర్ఘకాలం కష్టపడ్డాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో శ్రమించాను. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. ఈ కారణంగానే మైదానంలో అడుగుపెట్టడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
68
తిరిగి గాయం ఇబ్బంది పెట్టకుండా.. నెట్స్ లో బౌలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాను. నా శరీరం మీద ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేసేలా చూసుకున్నాను. అంటే.. నేనేదో ఆటలో వెనక్కి తగ్గినట్లు కాదు. ఎన్సీఏ నుంచి కోలుకుని బయటికి వచ్చిన తర్వాత చాలా ప్రాక్టీస్ చేశాను. గుజరాత్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాను
78
అదొక్కటే కాదు అనేక చోట్ల నెట్ ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా పాల్గొన్నాను. ఎన్నో ప్రాక్టీస్ మాచ్ లు ఆడాను. నన్ను నేను ఫిట్ గా చేసుకున్నాడు. నా లక్ష్యం ప్రపంచ కప్ లో రాణించడమే. నేనెప్పుడూ టి20 లో ఆడేందుకు ప్రాక్టీస్ చేయలేదు. ప్రస్తుతం వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్నాను. నెట్ ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. పది నుంచి 15 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాను.
88
గాయం మళ్ళీ తిరగబెట్టకుండా బాగానే ఉంది. ఇలా ఎక్కువగా బౌలింగ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. కొన్నిసార్లు ఎక్కువ సమయం గాయం నుంచి కోలుకోవడానికి పడుతుంది. కానీ నేనెప్పుడూ నిరాశ పడలేదు. ఎప్పుడెప్పుడు కోలుకుంటానా.. ఎప్పుడెప్పుడు ఫీల్డ్ లోకి వస్తానా?? అని మాత్రమే ఆలోచించాను.. అంటూ ఫ్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు.