IPL Top Scorers: ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే..

Published : Mar 19, 2026, 09:47 PM IST

IPL Top Scorers: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లలో నలుగురు భారతీయులే ఉన్నారు. విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ ఏకైక విదేశీ ఆటగాడిగా నిలిచారు.

PREV
16
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన ప్లేయర్లు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్. ఈ లీగ్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎందరో బ్యాటర్లు తమ అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది.

ఈ టాప్ 5లో నలుగురు భారతీయ ఆటగాళ్లు ఉండగా, కేవలం ఒకే ఒక్క విదేశీ ఆటగాడు చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్ల లిస్టు గమనిస్తే..

26
1. విరాట్ కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించారు. 2008 నుండి 2025 వరకు మొత్తం 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 8,661 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో 8,000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు ఆయనే. ఒకే ఫ్రాంచైజీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) తరపున 8,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. 2016 సీజన్‌లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఆయన ఐపీఎల్ కెరీర్‌లో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 132.85గా ఉంది.

36
2. రోహిత్ శర్మ

ఈ జాబితాలో రెండో స్థానంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ ఇప్పటివరకు 272 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 7,046 పరుగులు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్ 3 ఆటగాళ్లలో రోహిత్ ఒకరు. ఆయన తన కెరీర్‌లో 2 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు బాదారు. రోహిత్ అత్యధిక స్కోరు 109* (నాటౌట్). 2008లో డెక్కన్ చార్జర్స్ జట్టుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన రోహిత్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకు బలమైన స్తంభంలా మారారు. రోహిత్ స్ట్రైక్ రేట్ 132.09గా నమోదైంది.

46
3. శిఖర్ ధావన్

ఐపీఎల్‌లో అత్యంత నమ్మదగ్గ ఓపెనర్లలో ఒకరైన శిఖర్ ధావన్ మూడో స్థానంలో నిలిచారు. 2008 నుండి 2024 మధ్య 222 మ్యాచ్‌లు ఆడిన ధావన్ మొత్తం 6,769 పరుగులు చేశారు. లీగ్ హిస్టరీలో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లలో ఆయన ఒకరు. ధావన్ తన కెరీర్‌లో మొత్తం 51 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన తన సుదీర్ఘ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ వంటి ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు.

56
4. డేవిడ్ వార్నర్

టాప్ 5లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు డేవిడ్ వార్నర్. 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వార్నర్ 6,565 పరుగులు చేశారు. 6,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్ బ్యాటింగ్ సగటు (40.52) అత్యధికం కావడం విశేషం. వార్నర్ ఐపీఎల్‌లో 4 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఆయనదే. మూడుసార్లు (2015, 2017, 2019) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా వార్నర్ ఘనత సాధించాడు. 2009లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో శిఖరాగ్రానికి చేరింది.

66
5. సురేష్ రైనా

చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 5,528 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు. 2008 నుండి 2021 వరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా, ఐపీఎల్‌లో 5,000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. అందుకే ఆయనను అభిమానులు 'మిస్టర్ ఐపీఎల్' అని పిలుస్తారు. రైనా ఒక సెంచరీ, 39 అర్ధసెంచరీలు సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 136.73గా ఉంది. ముఖ్యంగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రైనా పేరిట ఉంది. సీఎస్కే జట్టు నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో రైనా కీలక పాత్ర పోషించారు.

Read more Photos on
click me!

Recommended Stories