Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి టీమిండియా టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఘోర పరాజయాలను ఎదుర్కొంటోంది. స్వదేశంలో దశాబ్దాల రికార్డులు కోల్పోయి, న్యూజిలాండ్ లాంటి జట్లకు సిరీస్‌లను సమర్పించుకుంది.
గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియా ప్రస్థానం టెస్టు, వన్డే ఫార్మాట్లలో అత్యంత గందరగోళంగా, నిరాశాజనకంగా సాగుతోంది. భారత జట్టు టెస్టు, వన్డే ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. దశాబ్దాల కాలంగా భారత గడ్డపై అజేయంగా కొనసాగుతూ ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించిన టీమిండియా రికార్డులు గంభీర్ హయాంలో పేకమేడల్లా కూలిపోతున్నాయి.
25
ఆ ఇద్దరూ బెస్ట్..
గతంలో రాహుల్ ద్రవిడ్ లేదా రవిశాస్త్రి లాంటి కోచ్‌ల ఆధ్వర్యంలో భారత్ విదేశాల్లో సైతం అద్భుత విజయాలు సాధించింది. అయితే, గంభీర్ పర్యవేక్షణలో జట్టు తన సొంత కోటలోనే బలహీనపడటం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక పర్యటనలో సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్ ఓడిపోవడంతో మొదలైన ఈ వైఫల్యాల పరంపర, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల వరకు నిరంతరాయంగా కొనసాగింది.
35
రెండు ట్రోఫీలు గెలిపించాడు..
గంభీర్ కోచింగ్ హయాంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లను గెలుచుకోవడం ద్వారా వైట్-బాల్ టోర్నమెంట్‌లలో విజయం సాధించినప్పటికీ, అతని రెడ్-బాల్ రికార్డు తీవ్ర విమర్శలను ఎదుర్కునేలా చేసింది. గంభీర్ వ్యూహాలు గానీ, ఆటగాళ్ల ఎంపికలో ఆయన అనుసరిస్తున్న విధానం గానీ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
కీలక సమయాల్లో జట్టు తడబడటం, సీనియర్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం లాంటి అంశాలు గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా హోమ్ సిరీస్‌లను కోల్పోవడం వల్ల భారత క్రికెట్ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మసకబారుతోంది.
55
ఓ మాయని మచ్చ..
ఇది కచ్చితంగా గంభీర్ ఖాతాలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. గంభీర్ తన అగ్రెసివ్ మైండ్ సెట్‌తో జట్టులో విప్లవాత్మక మార్పులు తెస్తాడని ఆశించిన బోర్డుకు, అభిమానులకు ఈ వరుస ఓటములు గట్టి షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో సైతం గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గంభీర్ వచ్చాడు, రికార్డులను పట్టుకెళ్లాడు అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జట్టులోని అంతర్గత విభేదాలు లేదా కోచ్, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.