శుభ్‌మన్ గిల్ కు భారత టీ20 జట్టులో స్థానం దక్కడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో కటక్‌లో మంగళవారం జరిగిన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాదిన్నర కాలంగా గిల్ బ్యాట్ నుండి టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు.
అతని చివరి 16 ఇన్నింగ్స్‌ల స్కోర్లు వరుసగా 13, 34, 39, 20*, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15, 46, 29* 4 పరుగులు ఉన్నాయి. ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే, గిల్ ఎక్కువ కాలం టీ20 జట్టులో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది.