కూటి కోసం కూలీపని చేస్తున్న ఫుట్‌బాల్ వుమెన్స్ టీమ్ కెప్టెన్... చూపులేని తండ్రికి అండగా...

First Published | May 24, 2021, 10:52 AM IST

కరోనా వైరస్ ఎన్నో జీవితాలను చిదిమేసింది. కరోనా వైరస్ తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన వారు కొందరైతే, లాక్‌డౌన్ కారణంగా జీవితం తారుమారై పడరాని కష్టాలు పడుతున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన అమ్మాయే ఫుట్‌బాల్ ప్లేయర్ సంగీతా సోరెన్. 

జార్ఖండ్‌లోని ధన్‌బాల్ జిల్లాలోని బాసమూది గ్రామానికి చెందిన సంగీతా వయసు 20 ఏళ్లు. 2018-19 సీజన్‌లో అండర్17, అండర్ 18 జట్లకు కెప్టెన్‌గా వ్యవహారించిన సంగీతా, భూటాన్, థాయ్‌లాండ్‌లలో జరిగిన టోర్నీల్లో కూడా పాల్గొంది.
అద్భుతమైన పర్ఫామెన్స్‌తో సీనియర్ టీమ్‌కి సెలక్ట్ అయిన సంగీతా సోరెన్, ఫుట్‌బాల్ స్టార్‌గా వెలిగిపోవాలని కలలెన్నో కనింది. అయితే చైనావోడు పుట్టించిన కరోనా వైరస్ కారణంగా ఆ ఆశలన్నీ తారుమారైపోయాయి. రెండేళ్ల టోర్నీలన్నీ ఆగిపోవడంతో బతుకుతెరువు కోసం కూలీగా మారింది సంగీత.

సంగీత తండ్రి దూబా సోరెన్‌కి కంటిచూపు సరిగా లేదు. కూలీ పనిచేసే అన్నకు లాక్‌డౌన్‌లో సరిగ్గా పనులు దొరకడం లేదు. దీంతో తల్లితో కలిసి ఇటుకలు మోస్తూ, కుటుంబాన్ని పోషించడానికి తనవంతు సాయం చేస్తోంది సంగీత.
వాస్తవానికి ఫుట్‌బాల్ క్రీడలో అద్భుతమైన ప్రతిభ చూపిన సంగీతాను ఆర్థికంగా ఆదుకుంటామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్, రెండేళ్ల కిందట ప్రకటించాడు. అయితే అందరు రాజకీయ నాయకులిచ్చే హామీల్లాగే ఇది కూడా ఉట్టి హామీగానే మిగిలిపోయింది...
సాయం చేయమని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వాళ్లు కూడా పట్టించుకోలేదు. దీంతో ప్రతీరోజూ ఉదయం ఫుట్‌బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ, ఆ తర్వాత పనికి వెళ్తోంది సంగీతా. భావి ఫుట్‌బాల్ ప్లేయర్ పడుతున్న కష్టాల గురించి కథనాలు రావడంతో కదిలిన కొందరు నేతలు, ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Latest Videos

click me!