England vs Pakistan : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్, సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో పాక్ ఇంటిదారి పట్టడం ఖాయమైంది.
పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఊచకోత.. హ్యారీ బ్రూక్ సెంచరీ విధ్వంసం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చగా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది పోరాటం వృధా అయింది.
26
పాకిస్తాన్ పోరాటం.. తడబడిన బ్యాటర్లు
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 63 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) పర్వాలేదనిపించినా, భారీ స్కోరు సాధించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచాడు. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
36
షాహీన్ అఫ్రిది ఆరంభ అదిరింది
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు షాహీన్ అఫ్రిది చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిలిప్ సాల్ట్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ (2), జాకబ్ బెథెల్ (8)లను కూడా అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడేలా చేశాడు. ఈ టోర్నమెంట్‌లో అఫ్రిది పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
కష్టాల్లో ఉన్న జట్టును హ్యారీ బ్రూక్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. మొదటిసారి టీ20ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్, కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక కెప్టెన్ సాధించిన మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతనికి సామ్ కర్రన్ (16), విల్ జాక్స్ (28) సహకారం అందించారు. బ్రూక్ చివరిలో అవుట్ అయినా, అప్పటికే ఇంగ్లాండ్ విజయం ఖాయమైంది.
56
ENG vs PAK : చివరి ఓవర్లలో ఉత్కంఠభరిత క్లైమాక్స్
చివరి ఓవర్లలో మొహమ్మద్ నవాజ్ వరుసగా వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్లో విల్ జాక్స్, జేమీ ఓవర్టన్‌లను నవాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. చివరి 7 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన స్థితిలో జోఫ్రా ఆర్చర్ క్రీజులోకి వచ్చాడు. 20వ ఓవర్ మొదటి బంతికే సల్మాన్ మీర్జా బౌలింగ్‌లో ఆర్చర్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌ను 19.1 ఓవర్లలోనే గెలిపించాడు.
66
పాక్ సెమీస్ అవకాశం కష్టమే
ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో కేవలం ఒక పాయింట్ మాత్రమే ఉన్న పాక్, తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. మరోవైపు, పాకిస్తాన్‌పై టీ20 ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌కు ఇది నాలుగో విజయం. మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ తన ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సెమీస్‌కు వెళ్లడం సంతోషంగా ఉందని తెలిపాడు.