Dhruv Jurel: భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తుండగా, యువ ఆటగాడు ధృవ్ జురేల్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు.
క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 14 నుంచి స్వదేశంలో ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్ లలో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి బరిలోకి దిగనున్నాడు. పంత్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
25
పంత్ రాక..
అయితే, పంత్ రాకతో గతంలో అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు ధృవ్ జురేల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జురేల్‌ను పక్కన పెట్టడం అస్సలు కుదరని పని అనే అభిప్రాయం బలంగా నెలకొంది. దీనికి కారణం జురేల్ ప్రస్తుతం కనబరుస్తున్న అద్భుతమైన ఫామ్. వరుస సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
35
రెండు శతకాలు బాదేశాడు..
దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన రెండో టెస్టులో ఏకంగా రెండు శతకాలు బాది తన బ్యాటింగ్ పటిమను చాటుకున్నాడు. అంతేకాకుండా, అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ ఒక సెంచరీ సాధించి, తాను ఎంతటి టాలెంటెడ్ బ్యాటర్ అని నిరూపించుకున్నాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణిస్తున్న జురేల్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే టాక్ నడుస్తోంది.
దీంతో ఫామ్‌లో ఉన్న ఈ యువ సంచలనాన్ని ఎలాగైనా తుది జట్టులో కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధృవ్ జురేల్‌ను జట్టులోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఆల్ రౌండర్ కోటాలో ఆడుతున్న నితీష్ రెడ్డిని తప్పించాల్సి ఉంటుంది. స్వదేశంలో జరిగే సిరీస్‌లో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నందున, నితీష్ రెడ్డి సేవలు అంతగా అవసరం ఉండకపోవచ్చునని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది.
55
తెలుగోడికి దెబ్బ..
నితీష్ రెడ్డి బౌలింగ్ అవసరం అంతగా లేకపోవడం, ధృవ్ జురేల్ అద్భుతమైన ఫామ్ దృష్ట్యా నితీష్ రెడ్డి కోసం జురేల్‌ను పక్కన పెట్టలేమని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. జట్టు సమతూకాన్ని బట్టి నితీష్ స్థానంలో జురేల్‌కు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాగా, ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఇక నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు గువహటి ఆతిథ్యం ఇవ్వనుంది.