IPL : కోహ్లీ, ధోని టీమ్స్ మధ్య మరో వివాదం.. రంగంలోకి బీసీసీఐ ! ఏంది బాసూ ఈ రచ్చ

Published : Apr 16, 2026, 08:53 PM IST

IPL 2026 : ఐపీఎల్ లో రెండు తోపు టీమ్స్ మధ్య మరో రచ్చ మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 'దోస ఇడ్లీ' సాంగ్‌తో పాటు తమ ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసింది.

PREV
15
ఆర్‌సీబీ మ్యాచ్‌లో 'దోస ఇడ్లీ' పాటతో మరో రచ్చ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ కొత్త వివాదానికి తెరలేపింది. ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం డీజే వ్యవహరించిన తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి సీఎస్‌కే అధికారికంగా ఫిర్యాదు చేసింది.

25
అసలేం జరిగింది? వివాదానికి కారణమైన ఆ పాట ఏంటి?

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డీజే "దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ" అనే వైరల్ సాంగ్‌ను ప్లే చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో దక్షిణాది వారిని గేలి చేయడానికి, మీమ్స్ చేయడానికి ఈ పాటను ఎక్కువగా వాడుతుంటారు. ఈ పాటను ప్లే చేయడం తమను కించపరచడమేనని సీఎస్‌కే భావిస్తోంది. ఇది ఏమాత్రం గౌరవప్రదంగా లేదని, ప్రత్యర్థి జట్టును తక్కువ చేసి చూపేలా ఉందని సీఎస్‌కే తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విచారణ జరుపుతోందని ఒక టాప్ ఐపీఎల్ అధికారి ధృవీకరించారు.

35
సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఏమన్నారంటే?

ఈ వివాదంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. "సాధారణంగా స్టేడియంలో ఉండే డీజేలు హోమ్ టీమ్‌కు సపోర్టుగా ఉంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, దీనిపై విచారణ జరపాలని మేము బీసీసీఐకి లేఖ రాశాం" అని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం డీజే పని కాదని ఆయన స్పష్టం చేశారు.

45
గతంలోనూ ఇదే తరహా వివాదం

గాయకుడు గానా అప్పు కంపోజ్ చేసిన ఈ పాట గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువైంది. గత ఏడాది ఆర్‌సీబీ తన సోషల్ మీడియాలో జితేష్ శర్మ ఈ పాట పాడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. అప్పట్లో సీఎస్‌కే అభిమానులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన తర్వాత ఇలాంటివి మళ్లీ జరగకూడదని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావించింది. కానీ, ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్లు అవుట్ అయినప్పుడు డీజే చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. ప్రత్యర్థిని అవమానించడం డీజే బాధ్యత కాదని సీఎస్‌కే అధికారి ఒకరు మండిపడ్డారు.

55
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ ఎవరు?

ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించి ఆర్‌సీబీ మంచి ఊపు మీద ఉంది. మరోవైపు, సీఎస్‌కే పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వరుసగా రెండో విజయం సాధించి ఇప్పుడిప్పుడే సీఎస్‌కే ఫామ్‌లోకి వస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories