ఈ ఏడాది ఆరంభంలో ఇండియా ఓపెన్ ఫైనల్‌లో ఇండోనేషియా మెన్స్ డబుల్స్ జోడీ హెండ్రా సెటివన్- మహ్మద్ అహ్సన్‌లపై విజయాన్ని అందుకున్నారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి... మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచి, బ్యాడ్మింటన్‌లో ‘డాడీస్’గా పేరు తెచ్చుకున్న హెండ్రా -అహ్సన్‌లపై మనోళ్లు చూపించిన పోరాటం అద్భుతం...
అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో చిరాగ్ శెట్టి- రాంకీరెడ్డి జోడీ, వరల్డ్ నెం.3 జోడీ లీ యంగ్- వాంగ్ చిన్‌లీపై 21-16, 16-21,27-25 తేడాతో సంచలన విజయం అందుకున్నారు. అయితే రెండు మ్యాచుల్లో గెలిచినా తర్వాతి రౌండ్‌కి అర్హత సాధించలేకపోయారు చిరాగ్ శెట్టి- రాంకీరెడ్డి జోడీ...
Satwiksairaj Rankireddy, Chirag Shetty
దానికి ముందు 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి... రజతంతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌లో ఇంగ్లాండ్ జోడి బెన్ లెన్-సీన్ వెండీలపై 21-15,21-13 తేడాతో సునాయాస విజయం అందుకున్న రెడ్డి- శెట్టి జోడి... స్వర్ణం కైవసం చేసుకుంది...
కామన్వెల్త్ గేమ్స్‌కి ముందు థామస్ కప్ 2022 టోర్నీలో ఓటమి లేకుండా భారత జట్టుకి టైటిల్ అందించారు ఈ డబుల్ జోడి. ఫైనల్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి, అహ్సన్- సుకామ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18-21, 23-21, 21-19 తేడాతో పోరాడి గెలిచారు. మొదటి సెట్‌లో ఓడిన తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత డబుల్స్ జోడి, వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ని కైవసం చేసుకుంది..
సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి మన తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 2000వ సంవత్సరం, ఆగస్టు 13న జన్మించాడు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి. ..
Chirag Shetty
చిరాగ్ శెట్టి ముంబై కుర్రాడు. 1997, జూలై 4న ముంబైలో జన్మించిన చిరాగ్ శెట్టి, 2016 నుంచి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డితో కలిసి హైదరాబాద్ ఓపెన్, థాయిలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, మారిషస్ ఇంటర్నేషనల్స్, ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్, వియత్నాం ఇంటర్నేషనల్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలవగా సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు..
Satwiksairaj Rankireddy, Chirag Shetty
పేరుకి తగ్గట్టుగానే సాత్విక్ ఆటలో క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తాడు. ఫార్మర్డ్ పొజిషన్‌లో ఉంటూ ప్రత్యర్థుల ఇచ్చే స్మాష్ షాట్స్‌ని తిప్పికొడతాడు. చిరాగ్ శెట్టి ఆటలో దూకుడు ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్‌వర్డ్ పొజిషన్‌లో ఉండే చిరాగ్ శెట్టి... ప్రత్యర్థిపై దూకుడైన ఆటతీరుతో దాడి చేస్తుంటాడు..
Asian Games 2018
ఈ ఇద్దరి ‘దోస్తీ’, ఇప్పుడు భారత జట్టుకి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం లేని మెన్స్ డబుల్స్‌లో మెడల్ తేవాలని... భారత బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 తొలి రౌండ్‌లో బై పొందిన సాత్విక్-చిరాగ్... రెండో రౌండ్‌లో 13వ సీడ్ మలేషియా జోడీ గో వీ షెమ్ - టాన్ వీ కియాంగ్‌తో తలబడే అవకాశాలున్నాయి.