వెనకేసుకొచ్చిన బీసీసీఐ..
ఈ వివాదంపై బీసీసీఐలోని అంతర్గత వర్గాలు స్పందించాయి. షమి కెరీర్ దాదాపు ముగిసినట్లుగా సంకేతాలు ఇచ్చాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో, జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు కాబట్టి, షమి లాంటి అనుభవజ్ఞుడైన, సీనియర్ బౌలర్ కోసం తాము సంప్రదించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, షమి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే అతన్ని జట్టులో చేర్చుకోలేదని బోర్డు స్పష్టం చేసింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినా, షమి ఫిట్‌గా ఉన్నా కూడా ఎందుకు నిరాకరించాడనే కొత్త అంశం తెరపైకి వచ్చింది.