సింధు చేసిన పనికి, నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... ఒలింపిక్ రన్నరప్ తై జూ ఎమోషనల్ పోస్ట్...

First Published | Aug 2, 2021, 9:37 AM IST

పీవీ సింధు, సెమీస్‌లో చైనీస్ థైపాయ్ ప్లేయర్ తై జూ యంగ్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. కాంస్య పతక పోరులో చైనా ప్లేయర్‌పై విజయం సాధించి, కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు చేసిన పనికి, ఫైనల్లో ఓడిన తై జూ యంగ్ కళ్లలో నీళ్లు తిరిగాయట..

బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో చైనా ప్లేయర్ చెన్ యూఫె‌తో జరిగిన మ్యాచ్‌లో తై జూ యంగ్ 21-18, 19-21, 21-18 తేడాతో ఓడింది... 

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసిన తై జూ, చైనా ప్లేయర్ వ్యూహాత్మక ఆటతీరు కారణంగా ఓటమి చెందింది. రజత పతకం గెలిచిన తై జూ, ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు చేసింది. 


‘నేను నా కలల వేదిక ఒలింపిక్స్‌లో మూడోసారి అడుగుపెట్టాను, తొలిసారి ఫైనల్‌కి వచ్చా. కానీ నేను అత్యున్నత వేదికపై నిలబడలేకపోయా. అందుకు నేను బాధపడుతున్నా...

pv sindhu

ప్రతీ ఒక్కరిలో లోపాలు ఉంటాయి. అయితే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నా...

నేను వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనకపోవచ్చు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించానని అనుకుంటున్నా. అయితే అది గోల్డ్ కాలేదు... 

P V Sindhu

నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఓ చిన్న విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా...

ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత, నా ఆటతీరుతో నేను సంతృప్తి చెందాను. మ్యాచ్ పూర్తయిన తర్వాత సింధు వచ్చి, నన్ను కౌగిలించుకుంది. నా ముఖం పట్టుకుని, ‘నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు, కానీ నువ్వు చాలా బాగా ఆడావు. ఈ రోజు నీది కాదు...’ అంటూ నా చేతులను పట్టుకుని ఓదార్చింది...

తనని ఓడించిన నాపై ఆమె చూపించిన అభిమానం, ప్రేమ చూసి... నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ఇదేనేమో...’ అంటూ రాసుకొచ్చింది తై జూ యంగ్... 

Latest Videos

click me!