వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవాను 6-3, 6-7 (47), 6-3 తేడాతో ఓడించి, టైటిల్ గెలిచింది ఆసీస్ ప్లేయర్ ఆష్లే బార్టీ...
తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా, బార్టీ జోరు ముందు నిలవలేకపోయింది. విజేతగా నిలిచిన ఆష్లే బార్టీకి 2.4 మిలియన్ డాలర్లు (17 కోట్ల 87 లక్షల రూపాయలు), రన్నరప్ కరోలినాకి 1.2 మిలియన్ డాలర్లు (దాదాపు 9 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీగా దక్కింది.
2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆష్లే బార్టీకి, వింబుల్డన్ రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 1980 తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి ఆస్ట్రేలియా మహిళాగా రికార్డు క్రియేట్ చేసింది ఆష్లే బార్టీ...
నిజానికి ఆష్లే బార్టీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. 2014 యూఎస్ ఓపెన్ ముగిసిన తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకున్న బార్టీ, ఆ తర్వాత క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చింది...
ఆస్ట్రేలియా వుమెన్స్ నేషనల్ టీమ్‌లో స్థానం సంపాదించిన ఆష్లే బార్టీ... బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, క్వీన్స్‌లాండ్ జట్ల తరుపున ఆడింది... 9 టీ20ల్లో 68 పరుగులు చేసిన బార్టీ, క్లబ్ క్రికెట్‌లో ఓ సెంచరీతో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు తీసి అదరగొట్టింది...
రెండేళ్ల తర్వాత తిరిగి టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బార్టీ, 2019 ఫ్రెండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఛాంపియన్‌గా నిలిచి మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెం.1 గా నిలిచింది...