Asia Cup 2022 : జట్టును ప్రకటించిన బీసీసీఐ.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్, జస్ప్రీత్ బుమ్రా అవుట్....

Published : Aug 09, 2022, 07:57 AM IST

ఆసియా కప్ 2022లో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇందులో కొంతమంది గాయాల కారణంగా దూరం కాగా.. కొంతకాలంగా దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. 

PREV
15
Asia Cup 2022 : జట్టును ప్రకటించిన బీసీసీఐ.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్, జస్ప్రీత్ బుమ్రా అవుట్....

ఆసియా కప్ 2022 వచ్చేసింది. టైటిల్ ఫేవరేట్ గా భారత్ బరిలో దిగనుంది. ఈ టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఇక ఈ సారి మరో హాట్ ఫేవరేట్ ఏంటంటే.. గత కొంతకాలంగా దూరంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. 

25
Sanju Samson

ఇక ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషన్ కిషన్ లకు చోటు దక్కలేదు. మరోవైపు ఆసియాకప్ గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ దూరం అయ్యారు.

35

గత ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇక ఆసియా కప్ ఆగస్టు 27నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది..ఈ  టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. ఇక భారత్ తన తొలి మ్యాచ్ దాయాది దేశమైన పాకిస్థాన్తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ ఇప్పటికే తన జట్టును ప్రకటించింది.

45

ఆసియా కప్ కు భారత జట్టు..

కెప్టెన్ -          రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్ -  కేఎల్ రాహుల్
విరాట్  కోహ్లీ
సూర్య కుమార్ యాదవ్
దీపక్ హుడా
వికెట్ కీపర్ - రిషబ్ పంత్
హార్దిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
ఆర్ అశ్విన్
వై చాహల్
ఆర్ భిష్ణోయ్
భువనేశ్వర్ కుమార్
అర్ద్షీప్ సింగ్
అవేష్ ఖాన్ 

55
Rohit Sharma

ఆసియా కప్ కు భారత జట్టు..

కెప్టెన్ -          రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్ -  కేఎల్ రాహుల్
విరాట్  కోహ్లీ
సూర్య కుమార్ యాదవ్
దీపక్ హుడా
వికెట్ కీపర్ - రిషబ్ పంత్
హార్దిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
ఆర్ అశ్విన్
వై చాహల్
ఆర్ భిష్ణోయ్
భువనేశ్వర్ కుమార్
అర్ద్షీప్ సింగ్
అవేష్ ఖాన్ 

Read more Photos on
click me!

Recommended Stories