22 స్వర్ణాలు! 61 మెడల్స్... కామన్వెల్త్ గేమ్స్‌లో మరింత దిగజారిన భారత్...

First Published Aug 8, 2022, 7:11 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022 సీజన్‌లో భారత ఆట ముగిసింది. 200 మందికి పైగా అథ్లెట్లు, భారీ ఆశలతో అడుగుపెట్టగా ఓవరాల్‌గా 61 పతకాలతో నాలుగో స్థానంలో ముగించింది భారత్. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొట్టమొదటిసారి కామన్వెల్త్‌లో అడుగుపెట్టి పతకాలు గెలిచారు...

2022లో జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో సరిగ్గా 22 స్వర్ణాలు గెలిచిన భారత జట్టు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలతో 61 మెడల్స్ గెలిచి... ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాతి స్థానంలో నిలిచింది...

2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తర్వాతి స్థానంలో నిలిచిన భారత్, ఈసారి గేమ్స్‌లో షూటింగ్ ఈవెంట్ లేకపోవడం వల్ల భారీగా నష్టపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు 7 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో 16 పతకాలు గెలిచారు. ఈ సీజన్‌లో అదే రిజల్ట్ రిపీట్ చేసి ఉన్నా భారత స్థానం టాప్ 3లో ఉండేది...

Image credit: Getty

2002 కామన్వెల్త్ గేమ్స్‌లో 69 పతకాలు సాధించిన భారత జట్టు, ఆ తర్వాత 2005లో 50 పతకాలు సాధించింది. 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధికంగా 101 పతకాలు సాధించింది భారత్...

2014 కామన్వెల్త్ గేమ్స్‌లో 64 పతకాలు సాధించిన భారత్, 2018 గోల్డ్ కోస్ట్ ఈవెంట్‌లో 66 పతకాలు సాధించింది. తాజాగా 61 పతకాలు అందుకున్న భారత్, గత ఎడిషన్ కంటే 5 పతకాలు తక్కువగానే సాధించింది...

కామన్వెల్త్ చరిత్రలో మొట్టమొదటి సారి లాంగ్‌ జంప్, హై జంప్, లాన్ బౌల్స్, స్టీఫుల్‌ఛేజ్, రేస్ వాక్ ఈవెంట్లలో పతకాలు గెలిచిన భారత్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ ఈవెంట్లలో అద్భుత విజయాలు అందుకుంది...

Sakshi Malik

2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో 38 స్వర్ణాలు గెలిచిన భారత్, 2002 మాంచెస్టర్‌లో 30, 2018 గోల్డ్ కోస్ట్‌లో 26 పతకాలు సాధించింది. 2006 మెల్‌బోర్న్‌లో 22 స్వర్ణాలు నెగ్గిన భారత్, బర్మింగ్‌హమ్‌లోనూ ఇదే ఫీట్ రిపీట్ చేసింది...

click me!