మీ పిల్లల ఒలింపిక్స్ కలను నెరవేర్చే 10 టిప్స్ ... ఫాలో కండి...

First Published | Aug 7, 2024, 8:28 PM IST

పిల్లల బంగారు భవిష్యత్ నే ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. కొందరు పేరెంట్స్ తమ పిల్లల క్రీడాసక్తిని గమనించి ఒలింపిక్ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆశపడుతుంటారు. అలాంటి పేరెంట్స్ ఈ టిప్స్ పాటించండి... 

Olympics

ఒలింపిక్స్... ప్రతి క్రీడాకారుడి కల. ఒలింపిక్స్ లో సత్తాచాటి దేశానికి గొప్పపేరు తేవాలని చాలామంది క్రీడాకారులుగా మారతారు... కానీ కొద్దిమంది మాత్రమే ఆ కలను నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహం వున్నవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడగలరు... ఒలింపిక్స్ స్థాయికి ఎదగలరు. 

అయితే పిల్లల ఫ్యాషన్ గుర్తించి వారిని ఆ దిశగా నడిపించే బాధ్యత తల్లిదండ్రులదే. మీ పిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నారంటే వారిని తగిన ప్రోత్సాహం అందించాలి. అంతేకాదు వారి భవిష్యత్ అవసరాలను ముందే గుర్తించి వాటిని సమకూర్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడే మీ పిల్లల ఒలింపిక్ స్థాయి కలలను సైతం మీరు నెరవేర్చగలరు. 
 

Olympics

మీ పిల్లల క్రీడా భవిష్యత్ కోసం 10 టిప్స్ పాటించండి : 

1. చిన్నప్పటినుండే పిల్లల పేరిట పొదుపు : 

ఇది కేవలం పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులే కాదు ప్రతి పేరెంట్స్ పాటించారు. పిల్లల చిన్నతనంనుండే వారిపేరిట కొంత డబ్బు పొదుపుచేయడం మంచింది. ఇలా దాచే చిన్నమొత్తాలే భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. 

2. బడ్జెట్ తయారుచేసుకొండి : 

మీ పిల్లల క్రీడాసక్తిని తెలుసుకొండి... వారు ఏ గేమ్ ను ఇష్టపడుతున్నారో ఆ దిశగా నడిపించండి. ఇదే సమయంలో భవిష్యత్ లో వారి అవసరాలను తెలుసుకొండి. ఇలా కోచింగ్, క్రీడా సామాగ్రి, ట్రావెల్, మెడికల్ కేర్ ఖర్చులను అంచనా వేయండి. అంతేకాకుండా క్రీడాపోటీలు, మంచి పోషకాలతో కూడిన ఆహారం, ఇతర ఖర్చులను అంచనా వేయండి. అప్పుడు పిల్లల భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించవచ్చు. 

Latest Videos


Olympics

3. ఎడ్యుకేషన్ సేవింగ్ ప్లాన్స్ :  

పిల్లల చదువు, క్రీడలు... రెండింటి ఖర్చు భరించడం చాలా కష్టం. కాబట్టి ముందుగానే మీ పిల్లల పేరిట ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొండి. భవిష్యత్ లో ఈ ప్లాన్ చదువుకోసం ఉపయోగపడటమే కాదు... ఇప్పటికిప్పుడు కూడా కొంత సొమ్మును మిగిలిస్తుంది. ఎడ్యుకేషన్ సేవింగ్ ప్లాన్స్ పై ట్యాక్స్ బెనఫిట్స్ వుంటాయి... ఇలా కలిసివచ్చే డబ్బులను సేవ్ చేసి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. 

4. లైఫ్ ఇన్సూరెన్స్ ఫాలసీ : 

కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మీ పిల్లల క్రీడా భవిష్యత్ కు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని ఫాలసీలు తక్కువ మొత్తంలో డబ్బులకు చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంటాయి. ఆ డబ్బులు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి. 

5. క్రౌడ్ ఫండింగ్ :  

మీ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారు...కానీ వారిని మరింత మెరుగ్గా తీర్చిదెద్దేందుకు అవసరమైన ఆర్థిక వనరులు మీ దగ్గర లేవనుకొండి... అప్పుడు క్రౌడ్ ఫండింగ్ కు వెళ్లండి. ఇలా డబ్బులు సమకూర్చుకుని పిల్లల క్రీడా అవరసరాలకు ఉపయోగించవచ్చు. 

6. కార్పోరేట్ స్పాన్సర్ షిఫ్ : 

కొన్ని కంపనీలు యువ క్రీడాకారుల టాలెంట్ ను గుర్తించి వారికి కావాల్సిన సాయం చేస్తాయి. అలాంటి సంస్థల ద్వారా కూడా మీ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చు.   
 

Child asks so many questions in a day at toddler age, it is normal to hold the head of parents

7.స్కాలర్ షిప్స్ : 

కేవలం బాగా చదివే విద్యార్థులకే కాదు క్రీడల్లో రాణించేవారికి కూడా కొన్ని సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తుంటాయి.  ఇలాంటి సంస్థలను సంప్రదించి ఆర్ధిక సాయం పొందవచ్చు. 

8. ప్రభుత్వ సహాయం : 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి.    అంతేకాదు స్వతహాగా క్రీడాకారులుగా ఎదుగుతున్నవారికి కూడా ఆర్థిక సాయం చేస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వాల సాయంతో కూడా మీ పిల్లల క్రీడా అవసరాలను తీర్చుకోవచ్చు. 

parent's day

9. పార్ట్ టైమ్ జాబ్స్ :

మీ పిల్లల చదువుతో పాటు క్రీడా అవసరాల కోసం చాలా డబ్బులు అవసరం  అవుతాయి. అందుకు ఆర్థిక భారం ఎక్కువైతే ఏదయినా పార్ట్ టైమ్ జాబ్స్ చేసయినా పిల్లల క్రీడా అవసరాలను తీర్చండి. 

10. ఆర్థిక క్రమశిక్షణ :
పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా వుంటారు. కాబట్టి పిల్లలను క్రీడాకారులను తీర్చిదిద్దాలనుకే తల్లిదండ్రులు తమ ఇష్టాయిష్టాలను కాస్త పక్కనబెట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. ఇలా ఆదా చేసిన డబ్బులు పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగించవచ్చు. 

click me!