100 గ్రాముల బ‌రువుతో ఒలింపిక్ మెడ‌ల్ దూరం.. వినేష్ ఫోగ‌ట్ హార్ట్ బ్రేకింగ్ ఫోటోలు

First Published | Aug 7, 2024, 4:13 PM IST

Vinesh Phogat : భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, మ‌హిళల 50 కేజీల విభాగంలో ఉండాల్సిన బ‌రువు కంటే 100 గ్రాముల అధిక బ‌రువుతో అన‌ర్హ‌త‌కు గుర‌య్యారు. 
 

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. కేవ‌లం బిగ్ షాక్ మాత్ర‌మే కాదు.. హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. దాదాపు మెడ‌ల్ ఖాయం చేసుకున్న త‌ర్వాత భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. 

Vinesh Phogat

టీమిండియా స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ పారిస్ ఒలింపిక్స్ లో మ‌హిళల 50 కేజీల విభాగంలో పోటీ ప‌డ్డారు. వ‌రుస విజ‌యాల‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ప్ర‌పంచ ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ల‌కు సైతం షాకిచ్చి ఫైన‌ల్ లోకి దూసుకెళ్లారు. 


Vinesh Phogat

దీంతో ఫైన‌ల్ గెలుపోట‌మితో సంబంధం లేకుండా ఒక ఒలింపిక్ మెడ‌ల్ క‌న్ఫార్మ్ అయింది. అయితే, తాను ఫైన‌ల్ లో గెలిచి గోల్డ్ మెడ‌ల్ కొట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇలాంటి త‌రుణంలో బిగ్ షాక్.. ! 

వినేష్ ఫోగ‌ట్ మ‌హిళ‌ల 50 కేజీల విభాగంలో అన‌ర్హ‌త‌కు గుర‌య్యారు. ఆమె ఉండాల్సిన బ‌రువు కంటే 100 గ్రాముల అధిక బ‌రువుతో అన‌ర్హ‌త వేటు ప‌డింది. 

కేవ‌లం 100 గ్రాముల బ‌రువు ఆమె నుంచి ఒలింపిక్ మెడ‌ల్ ను లాగేసుకుంది. ఈ విష‌యం తెలిసి యావ‌త్ భార‌తావ‌ని షాక్ కు గురైంది. 

వినేష్ ఫోగ‌ట్ పారిస్ ఒలింపిక్స్ ఫైన‌ల్స్ నుంచి అన్హ‌ర‌త‌కు గురైన త‌ర్వాత ఆమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. గెండె ప‌గిలే బాధ‌తో వినేష్ ఒక చోట కూర్చొని ఉన్నారు. 

ఆ ఫోటోలో ఒంట‌రిగా క‌నిపిస్తున్న వినేష్ ఫోగ‌ట్ తీవ్రమైన బాధ‌లో ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఒలింపిక్ మెడ‌ల్ సాధించే అవ‌కాశాన్ని 100 గ్రాముల బ‌రువు దూరం చేయ‌డం నిజంగా ఊహ‌కంద‌ని బాధ‌ను క‌లిగిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. 

Latest Videos

click me!