మీరు తలుపు వెనక దుస్తులు వేలాడదీస్తున్నారా?
వాస్తు ప్రకారం తలుపు వెనక దుస్తులు వేలాడదీయడం శుభప్రదంగా పరిగణించరు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. మీ ఇంటిలోని ప్రతి తలుపు సానుకూల శక్తికి మార్గంగా ఉంటుంది. అలా దుస్తులు వేలాడదీయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కాస్తా.. నెగిటివ్ గా మారే అవకాశం ఉంటుందట.
తలుపు వెనుక వేలాడదీసిన దుస్తులు శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, చివరికి అశాంతి, ఒత్తిడి , ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం వల్ల ఇంటి వాతావరణం చిందరవందరగా కనిపిస్తుంది. ఇది చిందరవందరగా కనిపించడమే కాకుండా మానసిక ప్రశాంతత , సానుకూల ఆలోచనలను కూడా అడ్డుకుంటుంది