దీపావళి నాడు చపాతీలు చేయొద్దు.. ఎందుకంటే?

First Published Oct 30, 2024, 3:16 PM IST

దీపావళి పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ రోజున ఇంట్లో రొట్టెలు, చపాతీలు చేయకూడదనే సంప్రదాయం ఉంది. దీనికి కారణమేంటంటే? 

diwali 2024 shubh muhurat

ఈ సంవత్సరం దీపావళి పండును అక్టోబర్ 31న జరుపుకోబోతున్నాం. ఈ రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. వీరి ఆశీస్సులు ఉంటే ఇంట్లో ఉన్న బాధలు, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. 

అయితే దీపావళి పండుగకు సంబంధించినఎన్నో ఆచారాలను పాటిస్తారు. అంటే దీపావళి నాడు రావిచెట్టు కింద దీపం వెలిగించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఈ రోజు నగలను, చీపుర్లను, డబ్బు పెట్టెను పూజిస్తారు. అంతేకాకుండా మర్చిపోకుండా దీపావళి నాడు ఇంటి ముందు అందమైన రంగోలీని కూడా వేస్తారు.

అయితే దీపావళి నాడు ఇండ్లలో చపాతీలను అస్సలు చేయరు. దీపావళి నాడు ఇంట్లో రొట్టెలు, చపాతీలు చేయడం అశుభంగా భావిస్తుంటారు.  ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


దీపావళి నాడు చపాతీలు చేయడం అశుభమా? 

జ్యోతిష్యుల ప్రకారం.. దీపావళి నాడు ఇంట్లో రొట్టెలు, చపాతీలు చేయడం నిషిద్ధం. ఇలా అని గ్రంథాలలో వివరించబడి ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చపాతీ కూడా ప్రతిరోజూ వండే ఆహారం కిందికే వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే చపాతీలను గోధుమలతో తయారు చేస్తారు.

ఈ గోధుమలు సూర్య భగవానుడికి సంబంధించినది. కాబట్టి ప్రతిరోజూ చేయడం ఒక వైపు సూర్యుడి స్థానాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే దీపావళి నాడు చపాతీని చేయడం సూర్య గ్రహాలను బలహీనపరుస్తుంది.

అసలు నిజమేంటంటే? దీపావళి అమావాస్య తిథి నాడు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో అమావాస్య నాడు చపాతీలు తయారుచేయడం వల్ల సూర్యుడు మన జీవితంలో చెడు ఫలితాలను తీసుకురావడం ప్రారంభిస్తాడు. అయితే ఇది ప్రతి అమావాస్యకు వర్తించదంటున్నారు నిపుణులు. మరి దీపావళికి మాత్రమే ఈ నమ్మకం ఎందుకంటే దీపావళి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు.
 


దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీరు  మీ జాతకంలోని గ్రహాలను బలోపేతం చేయాలంటే వివిధ రకాల వంటకాలను చేయొచ్చు.

కానీ చపాతీలను మాత్రం చేయకూడదు. దీపావళి నాడు చపాతీలను చేయడం వల్ల సూర్యుడు బలహీనపడినప్పుడు, అదృష్టం మీకు లభించదు. అలాగే లక్ష్మీ పూజ కూడా లోపభూయిష్టంగా మారుతుంది.
 

click me!