చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆస్వాదించే పండగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి మాత్రమే. ఇంటి నిండా దీపాలతో అలంకరించి, సాయంత్రం టపాసులు కాలుస్తూ సంబరంగా పండగ జరుపుకుంటారు. ఈ రోజున దాదాపు అందరూ లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల.. ఇంటికి శ్రేయస్సు, ఆనందం లభిస్తాయని నమ్ముతారు. అది మాత్రమే కాదు.. ఈ రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల కూడా మంచి జరుగుతుందట. కచ్చితంగా లక్ష్మీదేవి ఇంట అడుగుపెడుతుందట. మరి.. ఏ వస్తువులు ఇంటికి తీసుకురావాలో ఓసారి చూద్దాం..
1.శంఖం..
దీపావళి రోజున మీరు దక్షిణావర్తి శంఖాన్ని కొనుగోలు చేయాలి. అందులో.. కుంకుమ కలిపిన బియ్యాన్ని అందులో వేయాలి. ఇప్పుడు దానిని ఇంటి పూజా గదిలో లేదంటే… ఉత్తరం దిక్కున ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.
2. గోమతి చక్రం..
జోతిష్యశాస్త్రం ప్రకారం.. గోమతి చక్రం మహాలక్ష్మితో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. పూజ సమయంలో లక్ష్మీదేవి ముందు 11 గోమతి చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు.. ఇల్లు సంపదతో నిండి ఉంటుంది.
3. దీపావళి రోజున పసుపు..
దీపావళి పండగ రోజున పసుపు లేదంటే పసుపు కొమ్మలు కొనాలి. వాటిని పసుపు వస్త్రంలో కట్టి, దీపావళి రాత్రి లక్ష్మీ దేవి పవిత్రమైన పాదాల వద్ద ఉంచండి. ఇది మీకు వ్యాపారంలో అభివృద్ధిని, ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది.
4. తమలపాకులు..
లక్ష్మీదేవి పూజలో తమలపాకును తప్పనిసరిగా ఉంచాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఆమె ఆశీస్సులు పొందుతారు.
5. బంగారం, వెండి నాణేలు..
దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు బంగారు లేదా వెండి నాణేలను ఇంటి ఆలయంలో ఉంచడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
6. లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడి విగ్రహాలు
మీరు బంగారం , వెండి లేదంటే.. మట్టితో తయారు చేసిన లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడి విగ్రహాలను ఇంటికి తీసుకురావాలి.వాటిని ఏడాది పొడవునా పూజ గదిలో ఉంచి పూజించాలి.
lotus kamal flower
7.తామర పువ్వు..
దీపావళి 2024 రోజున తామర గింజల హారాన్ని సిద్ధం చేసి, దానిని లక్ష్మీ దేవి విగ్రహానికి సమర్పించండి. అలాగే, హవనం చేసేటప్పుడు తామర గింజలను ఉపయోగించండి, ఇది మీకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కాకుండా, లక్ష్మీ దేవి పూజకు తామర పువ్వు సమర్పించడం కూడా మంచిది.
8.దీపాలు కొనడం…
దీపావళి పండగ అమావాస్య రోజున వస్తుంది. ఆ చీకటిని పోగొట్టాలంటే ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలి. అందుకే.. ఈ రోజున దీపాలు కొనుగోలు చేయాలి. సాయంత్రం దీపాలతో ఇంటిని అలంకరించాలి. ఇలా చేయడం ఇంటికి ఆనందాన్ని, సంతోషాన్ని తెస్తుంది.