లైఫ్ లో సంతోషాలు, బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ వచ్చిన బాధలు పోకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం మనం కూడా మానసికంగా కుంగిపోతాం. అయితే.. అలాంటి సమయంలో ఆ బాధల నుంచి బయటపడాలి అంటే మనకు జోతిష్యశాస్త్రంలో చాలా రెమిడీలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం వల్ల చాలా రకాల సమస్యలను తొలగించవచ్చు. అది కూడా గవ్వలతో సాధ్యం అవుతుందట. అదెలాగో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
మీరు నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఐదు గవ్వలను తీసుకువచ్చి.. వాటిని ఇంట్లో పూజ గదిలోని లక్ష్మీదేవి వద్ద ఉంచాలి. లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించిన తర్వాత ఆ గవ్వలను శుభ్రం చేసి.. ఏదైనా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి.. మీరు డబ్బులు దాచుకునే దగ్గర.. ఈ గవ్వలు ఉంచిన వస్త్రాన్ని ఉంచడం మంచిది.