రాఖీ పండగను అన్నా, చెల్లెళ్లు, అక్కా-తముళ్ల మధ్య బంధానికి ప్రతీకగా భావిస్తారు. వారి ప్రేమకు చిహ్నంగా ఈ పండగను జరుపుకుంటారు. కేవలం.. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రాఖీ పండగను ఆగస్టు 19 తెల్లవారుజామున 2:21 నిమిషాల నుంచి.. మధ్యాహ్నం 1గంట 24 నిమిషాల వరకు ముహూర్తం ఉండనుంది. ఈ సమయంలో మాత్రమే రాఖీ కట్టుకోవాలి.