Spiritual : జగన్నాధుని రథయాత్ర.. ముస్లిం సమాధి ముందు ఎందుకు ఆగుతుందో తెలుసా?

First Published | Oct 20, 2023, 4:19 PM IST

 Spiritual: పూరిలో జరిగే జగన్నాథ్ ని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించింది అలాంటి జగన్నాధుని రథయాత్ర ఒక ముస్లిం సమాధి వద్ద ఆగుతుంది దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 

పూరి జగన్నాధుని రథయాత్ర గురించి భారతదేశం అంతా తెలిసిన విషయమే. ఇది భారతదేశంలో జరిగే ఘనమైన రథయాత్రలలో ఒకటి. అయితే ఈ రథయాత్రలో పూరి జగన్నాథుని రధాన్ని తరలిస్తున్నప్పుడు ఒక ముస్లిం సమాధి ఉన్న చోటున కొంచెంసేపు ఆపుతారట.
 

దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణమేంటో ఇప్పుడు చూద్దాము. సలబేగా అనే ఒక ముస్లిం శ్రీకృష్ణుడి పరమ భక్తుడత. ఇతని తల్లి హిందువే కృష్ణుడు భక్తురాలు కాని తండ్రి మాత్రం ముస్లిమ్. ఒకరోజు సలబేగా తన తండ్రితో పాటు యుద్ధంలో పాల్గొండగా తను పూర్తిగా గాయాల పాలయ్యాడు.

Latest Videos


అప్పుడు తన తల్లి శ్రీకృష్ణుని నామం జపించుకుంటూ ఉంటే గాయాలు తగ్గుతాయి అని చెప్పింది. అప్పుడు సలబేగా శ్రీకృష్ణుని జపిస్తూ ఉండగా గాయాలని తగ్గిపోతాయి. అప్పటి నుంచి శ్రీకృష్ణుడి మీద తనకు భక్తి పెరుగుతుంది. వాళ్ళ అమ్మ పూరి జగన్నాథుని గురించి విశేషాలు అని చెప్పగా పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్దాం అని అనుకుంటాడు సలబేగా.
 

 కానీ ముస్లిమ్ అయినందువల్ల అక్కడ తనని లోపలికి రానివ్వలేదు. అప్పుడు బృందావనం వెళ్లి అక్కడే సంవత్సరం పాటు సేవలు చేసుకున్న సలబేగా పూరి రథయాత్రలో పాల్గొందామని అక్కడి నుంచి పూరికి బయలుదేరుతాడు.
 

 దారిలో అస్వస్థకు గురై శ్రీకృష్ణుడికి ప్రార్థన చేస్తాడు. నేను పూరి వెళ్లేంతవరకు ఆ రథం ఆగితే బాగుండు అని అనుకుంటాడు. మరోవైపు పూరిలో ఒక చోటున రథం ఆగిపోతుంది ఎన్ని వేలమంది వచ్చి జరిపినా సరే ఆ రథం ఇంచు కూడా జరగలేదు.సలబేగ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే ఆ రథం కదిలింది.
 

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తాము ఉన్న చోటున ఆ రథం ఆగుతుంది. తను అక్కడే ఉంటూ శ్రీకృష్ణుడికి సేవలు చేస్తూ ఎన్నో రచనలు రాశారు. తిను ప్రాణాలు వీడిన తర్వాత అక్కడే సమాధి కూడా కట్టారు. కనుక ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ్ ని రథం ఆ  సమాధి ఉన్న చోటున ఆగి మళ్ళీ పయనం మొదలు పెడుతుంది.

click me!