Dussehra 2023: హిందూ మతంలో దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులలో 9 రోజుల తర్వాత దసరా పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే దసరా పర్వదినాన అపరాజిత లేదా శంఖు పువ్వుతో కొన్ని పరిహారాలు చేస్తే డబ్బులు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇందుకోసం ఏమేం పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అదృష్టాన్ని పెంచుకునే మార్గాలు
శంఖు పువ్వులను శివుడి పూజలకు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో కూడా ఈ పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే దసరా రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఐదు అపరాజిత పువ్వులను కలిపి స్నానం చేయండి. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది.
ఈ పువ్వులను భద్రంగా ఉంచండి
దసరా రోజు పూజ సమయంలో లక్ష్మీదేవికి అపరాజిత పువ్వులను సమర్పించండి. ఆ తర్వాత ఈ పువ్వులను సురక్షితమైన లేదా మీరు డబ్బుదాచే ప్రదేశంలో పెట్టండి. ఈ పరిహారం వల్ల మీ వాల్ట్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అలాగే దసరా రోజు ఈ శంఖు పువ్వులను చంద్రుడికి కూడా సమర్పించండి. ఇది మీ జీవితంలో సంతోషాన్ని, శాంతిని పెంచుతుంది.
నెగెటివ్ ఎనర్జీ పోతుంది
దసరా రోజున ఇంటి ఈశాన్య మూలలో ఒక పాత్ర పెట్టి అందులో అపరాజిత పువ్వులను ఉంచండి. ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఉంచుతుంది. అలాగే కుటుంబ గొడవలు, కొట్లాటల నుంచి కూడా విముక్తి పొందుతారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం
దసరా రోజున మీరు ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టైతే.. అక్కడ అపరాజిత పువ్వులను ఉంచండి. ఇది మీకు ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.