Garuda purana
గరుడ పురాణం గురించి మీకు తెలిసే ఉంటుంది. హిందూ పురాణంల దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. మొత్తం 18 పురాణాల్లో ఈ గరుడ పురాణం కూడా ఒకటి. దీనిలో ఎక్కువగా మనిషి మరణానంతరం ఏం జరుగుతుంది అనే విషయాలను వివరించారు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన తప్పులకు .. చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనే విషయాలను కూడా గరుడ పురాణం చెబుతుంది.
What Happen After Death
అయితే.. ఇదే గరుడ పురాణం.. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? అనే విషయాన్ని కూడా వివరించారు. ఈ మధ్యకాలంలో మనిషి లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయింది. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చి మనిషి పోతాడో ఎవరూ ఊహించడం లేదు.మరి, గరుడ పురాణం ప్రకారం.. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే సీక్రెట్ తెలుసుకుందాం..
Garuda Purana
గరుడ పురాణం లో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే.. ఆరోగ్యం పై ఎక్కువ దృష్టి పెట్టాలట. జీవితంలో బతకడానికి డబ్బు ఒక్కటి సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదించిన దానిని అనుభవించడానికి ఆయుష్షు కూడా అవసరం. అది ఆరోగ్యంతోనే సాధ్యం అని గరుడ పురాణం చెబుతోంది.
Garuda Purana
మరి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే...దానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలట. నాన్ వెజ్ ఆహారం ఎక్కువగా తీసుకునేవాళ్లకు ఎప్పటికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయట. దాని వల్ల ఆయుష్షు తగ్గిపోతుందట. అందుకే... ఎక్కువ కాలం జీవించాలి అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలని గరుడ పురాణం చెబుతోంది.