హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం సంవత్సరంలో వచ్చే ఐదవ నెల. పౌర్ణమి రోజు ఆకాశాన్ని పాలించే శ్రావణ నక్షత్రం నుంచి ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. అయితే ఈ నెలలో పూజలు వ్రతాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందరూ శ్రావణ శుక్రవారం ఎక్కువగా చేస్తారు.కానీ శ్రావణ సోమవారం కూడా చాలామంది చేస్తారు.
ఈ రోజు శివుడుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం నాడు ఉపవాసం చేయడం వలన ఈ జన్మలో చేసిన దోషాలుపోయి ప్రతికూల గ్రహాలు కలియక తొలగిస్తుందని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం చేస్తే మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను కూడా నాశనం చేస్తుంది.
ఈరోజు చేసే ఉపవాసం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాక్షిక ఉపవాసం, రెండు కఠిన ఉపవాసం. సాత్విక ఉపవాసం చేసేవారు పండ్లు గింజలు, సాబుదానా, మొదలైనవి తినవచ్చును. కఠిన ఉపవాసం చేసిన వారు కేవలం నీటిని మాత్రమే తాగుతారు.
సూర్యాస్తమయం తరువాత ఉల్లి, వెల్లుల్లిపాయ లేని భోజనంతో ఉపవాసంవిరమిస్తారు. నిజానికి శ్రావణమాసం సోమవారం ఉపవాసం సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తినటం నిషేధించబడింది. ఉపవాసం రోజు సగ్గుబియ్యం ఆహారంగా తీసుకుంటే ఉపవాస సమయంలో మీకు శక్తిని ఇస్తుంది.
అలాగే సాబుదానా ఉపవాసం రోజు తింటే మంచిదని కూడా భావిస్తారు. వీటిని పెరుగు లేదా వెన్న, వేరుశనగలతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ కూడా తినవచ్చును. ఆ పండు ఈ పండు అని కాకుండా దొరికిన ప్రతి పండు తినవచ్చును. బాదం పప్పుని పాలతో కలిపి బ్రేక్ ఫాస్ట్ లాగా తినవచ్చు.
అలాగే ఉపవాస సమయంలో పెరుగును తినటం కూడా చాలా మంచిది. పెరుగు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉపవాసం రోజు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.