కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు.. ఇలా చెయ్యడం వెనుక ఆంతర్యం ఏమిటి?

First Published | Nov 5, 2021, 10:16 AM IST

ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి (Diwali) వెళ్లిన మర్నాడు కార్తీక మాసం   ప్రారంభమవుతుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో  (Shivarathri) సమానమైన పుణ్యదినం. కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. కార్తీకమాసమంతా శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి శివునికి, విష్ణుమూర్తికి ప్రియమైన రోజులు. ఈ పర్వదిన రోజులలో భక్తులు (Devotees) భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున తెల్లవారు జామున నదీ స్నానం ఆచరించి ముందు పూజ గదిలో దీపం వెలిగించి తులసికోట దగ్గర దీపం వెలిగించాలి.
 

రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన (Deeparadhana) చేస్తారు. ఇలా 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ దీపాన్ని అరటి దొన్నేపై ఉంచి నదిలో వదులుతారు. ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడంతో మంచి ఫలితం ఉంటుంది. గుడికి (Temple) వెళ్లలేని వారు ఇంట్లో తులసికోట ముందు, దేవుని ముందు దీపం వెలిగించిన మంచి కలుగుతుంది. కార్తీక పౌర్ణమినాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడంతో  సమానం. శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది. సకల పాపాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటాం.
 

Latest Videos


దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి (Lakshmidevi) ఉంటుంది. అటువంటి దీపం కార్తీక మాసంలో (Karthika masam) పెట్టడం ప్రధానం. కార్తీకమాసంలో అగ్నిని ఆరాధన చేయడం, హోమాలు చేయడం మంచిది. అయితే ఈ కాలంలో అగ్ని ఆరాధన చేయడం, హోమాలు చేయడానికి వీలు కుదరదు కనుక అగ్ని స్వరూపమైనటువంటి దీపాన్ని వెలిగించి ఆరాధించడం ద్వారా అగ్ని ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. అందుకనే ఈ మాసంలో దీపాలు వెలిగిస్తారు. సూర్యుడు ఉదయించడం కన్నా ముందే ఉదయం సంధ్య వేళలో దీపం పెట్టాలి. అదేవిధంగా సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించే వేళలో (Sunset) సంధ్యా దీపం పెట్టాలి.
 

ఉదయం తులసి దగ్గర పెట్టే దీపం కార్తీక దామోదరుడుకి చెందుతుంది. దేవుని దగ్గర పెట్టే దీపం శివునికి చెందుతుంది. ఈ కార్తీకమాసం శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. లక్ష్మీదేవి తైలంలో ఉంటుందని భావిస్తారు. అందుకు దీపారాధన నువ్వుల నూనెతో (Sesame oil) చేయడం మంచిది. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించ   రాదు. కర్పూరంతో కాని మండుతున్న అగర్బత్తి తో కానీ వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత దీపలక్ష్మీ నమోస్తుతే అని నమస్కరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనం చేసిన పాపాలన్నీ (Sins) తొలగిపోయి, మనం కోరుకున్న కోరికలన్ని తీరుతాయని భావిస్తారు.

click me!