హిందూ మతంలో గోరింటాకును అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు. పాజిటివిటీ కూడా పెరుగుతుంది. జీవితంలో ఆనందం తీసుకువస్తుంది. గోరింటాకు చేతులకు ఎంత ఎర్రగా పండితే, అంత ఎక్కువ అదృష్టం లభిస్తుందని నమ్ముతారు.
గ్రహాలతోనూ గోరింటాకుకు సంబంధం...
జోతిష్య శాస్త్రం ప్రకారం, గోరింటాకు కొన్ని గ్రహాలకు సంబంధించినది. దీనిని చేతులకు పెట్టుకోవడం వల్ల గ్రహాల ప్రతి కూల ప్రభావాలను తగ్గించడంలో, పాజిటివ్ ఎనర్జీ పెంచడంలో సహాయపడుతుంది. గోరింటాకును సహజంగా అంగారక గ్రహం, శుక్రుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు.. జీవితంలో ప్రేమ, పెళ్లి, అందం, సంతోషంతో సంబంధం కలిగి ఉంటాయి.